Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గా ఎక్కువకాలం కొనసాగడని మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ అభిప్రాయపడ్డారు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఫైనల్ ఓవర్ వేసిన బౌలర్ జోగిందర్ శర్మ. ప్రస్తుతం హర్యానాలో డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఇటీవల 12 ఏళ్ల తర్వాత ధోనీని కలిశాడు. ఆ తర్వాత విడుదలైన ఒక బ్రాడ్ కాస్ట్ లో జోగిందర్ శర్మ గౌతమ్ గంభీర్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. Gautam Gambhir

Joginder Sharma About Gautam Gambhir

శుభంకర్ మిశ్రా బ్రాడ్ కాస్ట్ లో పాల్గొన్న జోగిందర్ శర్మ గౌతమ్ గంభీర్ అగ్రెసివ్ నెస్ అతనికి ప్రాబ్లమ్ అవుతుందని అన్నాడు. గౌతమ్ గంభీర్ చాలా అద్భుతంగా ఆలోచించగలరు. కానీ ఆ ఆలోచనలు మిగతా టీమ్ ఒప్పుకుంటుందా. లేదా అన్నది పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు వెళ్తాడు. దానివల్ల టీమ్ లో మిగతా ఆటగాళ్లు ఇబ్బంది పడే అవకాశం ఉందని అన్నారు. క్రికెట్ పట్ల గంభీర్ నిజాయితీగా ఉంటాడు. Gautam Gambhir

Also Read: Ms Dhoni: పోలీస్ డిపార్ట్మెంట్ లోకి మహేంద్ర సింగ్ ధోని..?

ముక్కుసూటిగా మాట్లాడతాడు. దానివల్లే అతను కోపంగా కనిపిస్తాడు. కానీ బేసిక్ గా గేమ్ కోసం ఏదైనా చేయగలిగే వారిలో గంభీర్ కూడా ఒకడని జోగిందర్ శర్మ గంభీర్ పై ప్రశంసలు కురిపించాడు. అయితే గంభీర్ వర్సెస్ ధోని మధ్య ఉన్న వివాదాలు సోషల్ మీడియాలో ఎలా ఉంటాయో తెలిసినవే కదా. Gautam Gambhir

ఈ బ్రాడ్ కాస్ట్ ఎప్పుడు రికార్డ్ చేశారు తెలియదు కానీ 12 ఏళ్ల తర్వాత జోగిందర్ శర్మ ధోనీని కలిసిన తర్వాత ఈ బ్రాడ్ కాస్ట్ విడుదలవడం….అందులోనూ గంభీర్ పై ఇలా మాట్లాడడంతో జోగిందర్ శర్మను కూడా ధోని అభిమానులు వారిలో కలిపేసుకుంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో జోగిందర్ శర్మ చేసిన ఈ కామెంట్స్ కు అంత ప్రాధాన్యత దక్కుతుంది. Gautam Gambhir