Kalki Part 2: Kalki as the star hero

Kalki Part 2: జూన్ 27న విడుదలైన కల్కి 2898 ad సినిమా బాక్సాఫీస్ వద్ద eతటి ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని సినిమా విడుదలయ్యే ముందు నాగ్ అశ్విన్ అశ్విన్ దత్ లు బయటపెట్టారు. ఇక దీనికి పార్ట్ 2 ఉంటుంది అని తెలియడంతో ఫ్యాన్స్ అందరూ పార్ట్ 2 మీదనే భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఇక కల్కి సినిమా ఎండ్ అయ్యే సమయంలో క్లైమాక్స్ లో కమల్ హాసన్ చెప్పే డైలాగ్ అందర్నీ ఆకర్షించింది. దీంతో క్లైమాక్స్ చూసిన సమయంలోనే పార్ట్ 2 పై మరింత ఆసక్తి పెరిగింది.

Kalki Part 2: Kalki as the star hero

అయితే కల్కి పార్ట్ 1 లో కల్కిగా ప్రభాస్ నటిస్తారని అందరూ అనుకున్నారు.కానీ ఆయన భైరవ పాత్రలో కనిపించి చివరిలో కర్ణుడి గా చూపించారు. దీపికా పదుకొనే కడుపులో పెరిగేది కల్కి అని క్లారిటీ వచ్చింది. అయితే కర్ణుడు పాత్రలో ప్రభాస్ నటిస్తే కల్కి పాత్రలో మరో హీరో నటిస్తారు అని అందరూ భావిస్తున్న వేళ స్టార్ హీరో పేరు కల్కి పాత్రలో వినిపిస్తోంది. ఇక ఆ హీరో ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. (Kalki Part 2)

Also Read: Prabhas: ప్రభాస్ భార్య కాబోతున్న త్రిష.. ఇదెక్కడి ట్విస్ట్..?

కల్కి పార్ట్2 లో నాగ్ అశ్విన్ సరికొత్త ప్లాన్ వేశారట.కల్కి పాత్రలో పవన్ కళ్యాణ్ ని తీసుకోవాలి అని భావిస్తున్నారట. కానీ ఇది కుదిరే పని కాదు.ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆయన చేసే సినిమాలను పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ సినిమా అంటే ఆయన కచ్చితంగా ఒప్పుకోరనే వాదన వినిపిస్తోంది. దాంతో నాగ్ అశ్విన్ మరో స్టార్ హీరోని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.ఇక ఆయన ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్..

Kalki Part 2: Kalki as the star hero

కల్కి పార్ట్ టు లో కర్ణుడిగా ప్రభాస్ మెప్పిస్తే కల్కి పాత్రలో ఎన్టీఆర్ ని తీసుకోవాలి అని చిత్ర యూనిట్ చర్చించుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం అని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం కల్కిగా కూడా ప్రభాస్ ని తీసుకుంటేనే బాగుంటుందని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరి ప్రభాస్ కల్కిగా నటిస్తారా లేక మరో హీరో ని తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.(Kalki Part 2)