Koratala Siva Faces Challenges with Devara1

Devara1: కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘ఆచార్య’ సినిమా సంఘటనలు ఇంకా ఎవరు మర్చిపోలేదు. అప్పుడే దేవరకు సినిమాకు సంబంధించిన కొన్ని వివాదాలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి ఎన్టీఆర్ హీరోగా గతంలో కొరటాల ‘జనతా గ్యారేజ్’ అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. రచయితగా ఉన్న కొరటాల శివ దర్శకుడుగా మారిన తరువాత ఒక ఫ్లాప్ కూడా ఎదుర్కోలేదు. ఎప్పుడైతే ఆచార్య సినిమా ఆయనకు చేదు ఫలితాన్ని అందించిందో అప్పటినుంచి ఆయన టైం బాగోలేదని చెప్పాలి.

Koratala Siva Faces Challenges with Devara1

ఇక ఎంతో కష్టపడి సెట్ చేసుకున్న ‘దేవర’ సినిమాకు ఇప్పుడు కొత్త తలనొప్పులు తయారవుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు విడుదల వాయిదా అయినా ఈ చిత్రం యొక్క విడుదలను అక్టోబర్లో చేయడానికి రంగం సిద్ధం చేయగా ఇప్పుడు ఆ సమయానికి కూడా ఈ సినిమా రావడం అనుమానంగా ఉన్న నేపథ్యంలో అభిమానులు కొరటాల శివ పై ఆగ్రహం గా ఉన్నారు. దానికి కారణాలు ఏవైనా కూడా కొరటాల శివ ఈ సినిమాను మరొకసారి వాయిదా వేస్తే ఊరుకోబోము అని అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఇంకొక వైపు ఎన్టీఆర్ వరుస సినిమాలు ఒప్పుకున్న నేపథ్యంలో ఆయన డేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయట.

Also Read: Mamitha Baiju: కుర్ర అందాలకు భలే ఛాన్స్.. సెటిల్ అయ్యేనా!!

‘దేవర’ సినిమా కోసం ఆయన కేటాయించిన డేట్లు ఇప్పటికే పూర్తయ్యాయట. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ డేట్లు సర్దుబాటు కాకపోతే ఈ సినిమా అక్టోబర్లో రావడం దాదాపు కష్టమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కొరటాల శివ ఏ విధంగా ఈ సినిమాను పూర్తి చేసి అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడు అనేది చూడాలి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేశారు. తొందర్లోనే టీజర్ కూడా విడుదల చేయబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కి అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.