Bangladesh: మన పక్క దేశమైన బంగ్లాదేశ్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి పూర్తిగా చేతులు దాటిపోయాయి. ఆందోళనకారులు ప్రధాని షేక్ హసీనా ఇంటిని ముట్టడించారు. ఆందోళనకారుల చర్యలు విపరీతం కావడంతో… పరిస్థితి అదుపు తప్పింది. దీంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని వదిలి పారిపోయారు. బంగ్లాదేశ్ ను వదిలిన షేక్ హసీనా.. ప్రత్యేక హెలికాప్టర్లో ఇండియా చేరుకున్నారు. Bangladesh

Prime Minister of Bangladesh who fled the country

వాస్తవానికి గత నెల రోజులుగా బంగ్లాదేశ్ దేశంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని… ప్రధాని షేక్ హసీనా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని మొదటి నుంచి బంగ్లాదేశ్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు స్వతంత్ర యోధులకు రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ వెళ్తారు? నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆందోళనకు దిగారు కొంతమంది విద్యార్థులు అలాగే నిరుద్యోగులు. Bangladesh

Also Read: Vallabhaneni Vamsi: జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ హౌస్ లో దాక్కున్న వల్లభనేని వంశీ ?

అయితే ఈ ఆందోళనలు చిలికిచిలికి జెడి వానగా తయారయ్యాయి. గత నెల రోజులుగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఆందోళనకారులు. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నడుస్తోంది. అయినప్పటికీ ప్రధాని షేక్ హసీనా వెనక్కి తగ్గలేదు. దీంతో ఆందోళనకారులు… ప్రధాని షేక్ హసీనా ఇంటిని ముట్టడించారు. Bangladesh

అయితే అప్పటికే ఇండియాకు పారిపోయారు ప్రధాని షేక్ హసీనా. అక్కడి నుంచి లండన్ కు వెళ్లే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆందోళనకారులు షేక్ హసీనా ఇంట్లోకి వెళ్లి నాన రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. Bangladesh