Ram Charan: ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకొని దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాతో ఒక్కసారిగా మార్కెట్లో పాన్ ఇండియా హీరోలుగా బదిలీ కాగా వీరితో సినిమా చేయడానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్మాతలు రెడీగా ఉన్నారు. వందల కోట్ల సినిమాలను నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఆ విధంగా ఈ ఇద్దరు కూడా ఇప్పుడు ప్రతిష్టాత్మక సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారని చెప్పాలి.

Ram Charan and NTR movies Release Dates

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా చేస్తూ ఉండగా ఈ చిత్రం యొక్క మొదటి భాగం దాదాపుగా చివరి దశ షూటింగ్ కు చేరుకుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. ఇటు చరణ్ కూడా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ దాదాపుగా పూర్తయిందనే చెప్పాలి. ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయడానికి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసింది.

Also Read: Bigg Boss 8: బిగ్ బాస్ 8 ఫైనల్ లిస్ట్.. హౌస్ లోకి వెళ్ళేది వీళ్లే..!

ఇక ‘దేవర’ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ఎన్టీఆర్ మొదలు పెట్టగా ఇటీవల ఓ రొమాంటిక్ పాటను కూడా విడుదల చేశారు. ఇది కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ‘దేవర’ సినిమా యొక్క విడుదల అక్టోబర్లో ఉండదు అని ప్రచారం టాలీవుడ్ సర్కిల్లో వినబడుతుంది. కారణం ఏదైనా కూడా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా యొక్క విడుదల మరొకసారి వాయిదా పడడం ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చడం లేదు.

ఇంకొక వైపు చరణ్ తన సినిమాను డిసెంబర్లో విడుదల చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ పాట విపరీతంగా ఆకట్టుకున్న నేపథ్యంలో త్వరలోనే టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. మరి ఇద్దరూ హీరోలు కలిసి ఓ సినిమాతో రాగా ఇప్పుడు సోలో సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆ విధంగా చరణ్ ఎన్టీఆర్ కంటే ఓ స్టెప్పు ముందు ఉన్నడనే చెప్పాలి. మరి విజయం ఎవరికీ లభిస్తుందో చూడాలి.