Trisha is going to be Prabhas wife

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్నారు. అలాంటి ఈయన ఇప్పటికే నాలుగు పదుల వయసు దాటి ఐదు పదుల వయసు దగ్గరికి వస్తున్నా కానీ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో దాదాపు నాలుగు నుంచి ఐదు సినిమాలు వరుసగా ఉన్నాయి. ఆయన కెరియర్ ఇంత సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నా కానీ వివాహం విషయంలో వెనుకబడిపోయారు. అయితే గత కొంతకాలం నుంచి ప్రభాస్ పెళ్లి విషయంలో అనేక వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు.

Trisha is going to be Prabhas wife

వర్షం సినిమా సమయంలోనే ప్రభాస్ త్రిషను పెళ్లి చేసుకుంటారని అనేకం వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాలేదు. ఆ తర్వాత అనుష్క శెట్టి తో ప్రభాస్ పెళ్లి అని కూడా ఎన్నో వార్తలు వచ్చాయి .అది కూడా పక్కదారి పట్టింది. అలాంటి ఈ తరుణంలో ప్రభాస్ వర్షం సినిమా సమయం నుంచే త్రిష అంటే ఇష్టం పెంచుకున్నారట. కానీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. అయితే తాజాగా త్రిష ప్రభాస్ భార్య కాబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. మరి బ్రేకప్ చెప్పుకున్న ఈ జంట మళ్లీ ఎందుకు కలవబోతున్నారు. ప్రభాస్ భార్యగా త్రిష అవ్వడం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. (Prabhas)

Also Read: Kushi Kapoor: అన్నకు జాన్వీ.. తమ్ముడు కి ఖుషి.. వాటే ప్లాన్!!

త్రిష ప్రభాస్ భార్య అవడం అంటే అది నిజ జీవితంలో కాదు సినిమాలో.త్రిష తో సినిమా అంటే ప్రభాస్ కి కూడా ఇష్టమే నట. కానీ మళ్ళీ ఇద్దరినీ కలిపి నటింపజేసే కథ ఇప్పటివరకు రాకపోవడంతో ఆగిపోయారట. అలాంటి ప్రభాస్ నిజజీవితంలో కూడా త్రిష తో ప్రేమలో పడ్డారని అనేక వార్తలు వచ్చాయి. అంతే కాదు వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలిసింది. కానీ ఈ వార్తలన్నీంటికి చెక్ పెడుతూ, వారి మధ్య స్నేహమే ఉందని తెలియజేశారు. అలాంటి వీరిద్దరూ భార్యాభర్తలు కావాలని చాలామంది అభిమానులు ఆశించారు. అలాంటి ఆశ నిజం కాబోతోందట.

Trisha is going to be Prabhas wife

ఎట్టకేలకు ప్రభాస్ కథానాయకుడిగా సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఒక చిత్రం రాబోతోంది అదే స్పిరిట్. ఈ కథకు సంబంధించి అనేక పనులు జరుగుతున్నాయట. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఇందులో కథానాయికగా త్రిష నటిస్తోందని, త్రిష ప్రభాస్ కు భార్య పాత్ర లో చేస్తుందట. ఈ పాత్ర ప్రకారం ఆమె హుందాతనంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందులో ప్రభాస్ భార్యగా త్రిష తీసుకోబోతుండడంతో జీవితంలో కూడా ఆయనకు భార్య కావాలని చాలామంది అభిమానులు ఆశిస్తున్నారు. అయితే 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రాబోతోందని తెలుస్తోంది.(Prabhas)