Venkatesh Slowdown: From Frequent Releases to Selective Projects

Venkatesh: తెలుగులో ఫ్యామిలీ చిత్రాలు చేసే హీరోగా పేరున వెంకటేష్ ఇటీవల కాలంలో యాక్షన్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన గత సినిమా ‘సైంధవ్’ యాక్షన్ నేపథ్యంలోనే రాగా ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. సంక్రాంతికి ఈ సినిమా వచ్చినా కూడా కంటెంట్ చాలా వీక్ గా ఉండడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆదరించలేదు. ఇక ఈ సినిమా వచ్చి చాలా కాలం దాటుతున్న కూడా ఆయన కొత్త సినిమా మొదలుపెట్టలేదని వార్తలు మొదట్లో వినిపించాయి.. కానీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన ఓ సినిమాను మొదలుపెట్టి దాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

Venkatesh Slowdown: From Frequent Releases to Selective Projects

ఇప్పటికే ఈ సినిమా యొక్క షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఒకప్పుడు ఏదాదికి రెండు సినిమాలను చేసే వెంకటేష్ ఇప్పుడు ఒక సినిమా చేసే స్థితిలో కూడా లేకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన మాత్రమే కాదు సురేష్ బాబు కూడా తన ప్రొడక్షన్ నుంచి ఎలాంటి సినిమాలు చేయడం లేదు.. వీరు ఎందుకు సినిమాల పట్ల ఆలస్యం చేస్తున్నారో అన్న విషయం ప్రతి ఒక్కరిని తోలుస్తుంది. మరి అనిల్ రావిపూడి తో మూడోసారి కలిసి చేస్తున్న వెంకటేష్ ఈ సినిమా ద్వారా విజయాన్ని భారీ స్థాయిలో విజయం అందుకుంటాడా అనేది చూడాలి.

Also Read: Kavya Thapar and Bhagyashree Borse: ఎవరి అందం మెప్పించేనో!!

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ‘రానా నాయుడు’ అనే ఓ వెబ్ సిరీస్ లో కూడా వెంకటేష్ నటిస్తున్నాడు. ఇందులో రాణా తో కలిసి వెంకటేష్ నటించబోతూ ఉండగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ త్వరలోనే కాబోతుంది. ఇప్పటికే మొదటి బాగానికి మంచి పేరొచ్చింది. అడల్ట్ కంటెంట్ ఉండనే కానీ వెంకటేష్ ను ఆ విధంగా చూడడం మొదటి సారి. మరి ఈ రెండో పార్ట్ ఎలా ఉంటుందో చూడాలి.