Is Vithika Sheru going to get married for the second time

Vithika Sheru: వితికా షెరు.. టాలీవుడ్ లో ఒకప్పటి లవర్ బాయ్ హీరో వరుణ్ సందేశ్ భార్యగా ఇండస్ట్రీలో సుపరిచితురాలైన ఈ ముద్దుగుమ్మ వరుణ్ సందేశ్ భార్య కంటే ముందే సినిమాల్లో హీరోయిన్గా చేసింది.అలా ఈమె వరుణ్ సందేశ్ తో కలిసి పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమా లో నటించిన సమయంలో ప్రేమలో పడింది.అలా వీరిద్దరికి 2016లో పెళ్లయింది. ఇక ఈమె కన్నడ సినిమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై తెలుగులో భీమిలి కబడ్డీ జట్టు, ఝుమ్మంది నాదం వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది.

Is Vithika Sheru going to get married for the second time

ఇక మొదటిసారి ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో ముఖ్యపాత్రలో నటించింది. అలాగే పడ్డానండి ప్రేమలో మరీ అనే సినిమాలో హీరోయిన్గా చేసింది. అలా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ మాత్రమే కాదు ఫ్యాషన్ డిజైనర్ కూడా.. కొన్ని సినిమాలకు తానే స్వయంగా డ్రెస్సులు డిజైన్ చేసుకునేది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ వరుణ్ సందేశ్ తో పెళ్లయ్యాక సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. (Vithika Sheru )

Also Read: Pushpa 2: పుష్ప 2.. ఇలా అయిపోవడానికి కారణం ఏంటి?

ఇక బిగ్ బాస్ తెలుగులో ఇద్దరు భార్య భర్తలు వచ్చి ఫేమస్ అయిపోయారు. ఇక వరుణ్ సందేశ్ ప్రస్తుతం మళ్ళీ సినిమాల్లో జోరు పెంచేశారు. ఈ మధ్య విరాజి, నింద వంటి సినిమాలలో నటించారు. అయితే తాజాగా వితికా షెరు ఓ నటుడితో ఉన్న ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి న్యూ బిగినింగ్ అంటూ క్యాప్షన్ పెట్టింది.దీంతో చాలామంది జనాలు ఈ ఫోటోను చూసి ఏంటి వితిక షెరు రెండో పెళ్లి చేసుకోబోతుందా.. ఆ నటుడుతో ఎందుకు అంత క్లోజ్ గా దిగి కొత్త ప్రయాణం అని పోస్ట్ పెట్టింది..

Is Vithika Sheru going to get married for the second time

అని కామెంట్లు పెడుతున్నారు. ఇక మరి కొంతమందేమో ఏంటి వితికా కొత్త మొగుడా.. వరుణ్ సందేశ్ ని వదిలేసావా..ఆ నటుడుతో ఉన్న ఫోటోలను చూస్తే అందరూ ఏమనుకుంటారు.. అంటూ ఎన్నో కామెంట్లు పెడుతున్నారు. అయితే నెటిజన్స్ పెట్టిన కామెంట్స్ లో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే వితిక షెరు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటుందట. అందుకే ఆ నటుడితో కొత్త ప్రయాణం అని పోస్ట్ పెట్టింది.త్వరలోనే ఆమె కొత్త సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది(Vithika Sheru )

https://www.instagram.com/p/C-UKRY8MnQ5/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==