Janhvi Kapoor: Is She More Popular in Tollywood than Bollywood

Janhvi Kapoor: బాలీవుడ్ కథానాయక జాన్వీ కపూర్ తెలుగులో ఎన్టీఆర్ సరసన ‘దేవర’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె తెలుగులో హీరోయిన్ గా చేయాలని చెప్పి చాలా రోజులుగా ప్రయత్నాలు చేసింది. కానీ సరైన కథ, సరైన హీరో దొరకకపోవడంతో ఆమె తెలుగు ఎంట్రీ కాస్త లేట్ అయింది. అయితే లేట్ అయినా కూడా లేటెస్ట్ గా ఎన్టీఆర్ సరసన ఆమె హీరోయిన్ గా నటించడం ఆమె అభిమానులను ఎంతగానో సంతోషపెట్టింది. ఒక పెద్ద సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం నిజంగా మంచి విషయం అన్నది చెప్పాలి.

బాలీవుడ్లో ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. ఆమె అందాలను చూడడానికి దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు ఆమె సినిమాల ద్వారా.. సోషల్ మీడియాలో కూడా ఆమె చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు. తన ఇంస్టాగ్రామ్ లో రోజుకొక ఫోటోషూట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇలాంటి అందాలను బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని దర్శకులు తెరమీద బాగా చూపించలేదు అన్న విమర్శ ఎప్పుడూ ఉంది.

Also Read: Tollywood: ఆ మూడింటిలో మిస్టర్ బచ్చన్ కే బజ్ ఎక్కువ!!

ఆమె లోని అభినయాన్ని వెలికి తీసిన చాలామంది దర్శకులు ఆమె అందాలను సరికొత్తగా చూపించడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే తెలుగులో మాత్రం ఆమెను చాలా బాగా చూపించబోతారని మొదట్లో వార్తలు వినిపించగా తాజాగా విడుదలైన పాట ఆ వార్తలను నిజం చేస్తుంది. ఎన్టీఆర్ తో కలిసి ఆమె నటించిన ఓ రొమాంటిక్ పాట ఇటీవలే విడుదల కాగా అది దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. యూ ట్యూబ్ లో కూడా ట్రెండింగ్ లో ఉంది.

బొద్దు అందాలతో ముద్దుముద్దుగా కనిపిస్తున్న జాన్వి కపూర్ ను చూడడానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. పాట కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా జాన్వి అందాలు ఈ పాట ఇంతటి పెద్ద హిట్ అవ్వడానికి కారణం అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్లో విడుదల కాబోతుండగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుంది. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా జాన్వి కపూర్ కు ఎలాంటి పేరును తీసుకు వస్తుందో చూడాలి.