Kavya Thapar: Her Unusual Journey with Puri Jagannadh

Kavya Thapar: టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో అగ్ర దర్శకుడిగా ఉన్న పూరి జగన్నాథ్ చిత్రంలో నటించాలని ప్రతి ఒక్క నటీనటులకు ఉంటుంది. ముఖ్యంగా హీరోలు హీరోయిన్లు ఆయన సినిమాలలో ఒక్కసారైనా నటించాలని కోరుకుంటారు. ఆ విధంగా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో హీరోయిన్ గా నటించిన కావ్య కాపర్ కు అయన దర్శకత్వం లో నటించాలని కోరుకుందట. అలా ఆమెకు ఈ సినిమాలో అవకాశం రావడం విచిత్రంగా ఉందని ఆమె చెప్తుంది.

Kavya Thapar: Her Unusual Journey with Puri Jagannadh

పూరీ కెరియర్ను నిలబెట్టిన సినిమా ఇస్మార్ట్ శంకర్ అని కచ్చితంగా చెప్పవచ్చు. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా సీక్వెల్ ; డబల్ ఇస్మార్ట్ ఇప్పుడు ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో కావ్య హీరోయిన్ గా ఎంపిక అవడం నిజంగా చిత్రంగా జరిగిందని ఆమె చెప్తుంది. పూరి జగన్నాథ్ కావ్యాల పరిచయం ఇప్పటిది కాదట. ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఉన్నదని తెలుస్తుంది.ఇస్మార్ట్ శంకర్ సినిమా కే ఆమెను ఆడిషన్ చేశారట పూరీ. అయితే కావ్య ఆ పాత్రకు సెట్ కాకపోవడంతో ఆమెను తీసుకోలేమని చెప్పరట.

Also Read: Prabhas: ఎవరి పనుల్లో వారున్న ప్రభాస్,ప్రశాంత్ నీల్.. సలార్ 2 అంతే!!

ఆ తర్వాత డబుల్ ఇస్మార్ట్ లో హీరోయిన్ పాత్ర కోసం తనను ఎంపిక చేశారు అన్న విషయాన్ని ఆమె ఇటీవల ఏ చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమంలో వెల్లడించింది. సాధారణంగా పూరీ సినిమాలో హీరోయిన్లు ఎక్కువగా కొత్తవాళ్లే కనిపిస్తారు. ముఖ్యంగా ముంబై నుంచి దిగుమతి అయిన వాళ్లే కనిపిస్తారు. ఆ విధంగా పెద్ద హీరోయిన్ అయి ఉంటే పూరి తీసుకోడు కాబట్టి కొత్త వాళ్లకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా వారికి ఇవ్వరు కాబట్టి కావ్యకు ఆయన ఈ అవకాశం ఇచ్చారని తెలుస్తుంది. ఏదేమైనా ఆమెకు ఈ సినిమా ఉపయోగపడుతుందా అనేది చూడాలి.