Bangladesh: బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటన వలన ఇప్పటివరకు 350 మందికి పైగా చనిపోయారు. రిజర్వేషన్లు తీసివేస్తామని షేక్ హసీనా సర్కార్ మాట ఇచ్చినప్పటికీ యువత ఈ స్థాయిలో ఉద్యమించడం వెనక అంతర్జాతీయ పాలిటిక్స్ ఉన్నాయని ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక పాకిస్తాన్ ఉన్నట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ లో యాక్టివ్ గా ఉండే జమాద్ ఈ ఇస్లామిక్ పార్టీకి చెందిన యూత్ వింగ్0;35 బంగ్లాదేశ్ లోను ఉంది. Bangladesh

Pakistani conspiracies behind Bangladesh riots Modi Big Sketch

ఆ యూత్ వింగ్ అనవసరంగా ఈ అల్లర్లను రేపుతుందని ఇటీవలే బంగ్లాదేశ్ సర్కార్ ఆ సంస్థను ఉగ్రసంస్థగా ప్రకటించి దేశంలో నిషేధించింది. అయినప్పటికీ పాకిస్తాన్ లోని పార్టీలు, ఆర్మీలు, ఐఎస్ఐ సపోర్ట్ తో ఆ వింగ్ ఉండడంతో హింసాత్మక ఘటనలు ఇంకాస్త పెద్ద ఎత్తున చెలరేగాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల పాకిస్తాన్ కు వచ్చే లాభం ఏంటంటే…. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు షేక్ హసీనా తండ్రి ముజుబీర్ రెహమాన్. Bangladesh

Also Read: Jagan: బెంగళూరులోనే జగన్ ఉండడానికి ఇంత పెద్ద కారణం ఉందా?

ఆ పార్టీ అనేది ఇండియాకు సపోర్ట్ గా వస్తుంది. 2008 నుంచి షేక్ హసీనా ప్రధానిగా ఉండడంతో భారత్ తో మరింతగా సంబంధాలు పెరిగాయి. ఈ విషయం పాకిస్తాన్, చైనాకు అసలు నచ్చడం లేదు. అందుకే ఎలాగైనా హసీనాను గద్దె దించి తమకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇలాంటి కుట్రలు చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Bangladesh

ఇందులో ఎంతవరకు వాస్తవం ఉన్నది అనేది పక్కన పెడితే…. నిజంగా ఇలాంటి ఘటనల వల్ల భారత్ ఒక మంచి స్నేహితురాలిని మిస్ అయినట్టే అందుకే ప్రధాని మోదీ సైతం హుటాహుటిన ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. నిజంగా దీని వెనుక పాటిస్తాన్, ఐఎస్ఐ ఉందని ఇంటెలిజెన్స్ చెబితే…. ప్రధాని మోదీ దానికి చెక్ పెట్టేలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. Bangladesh