Prabhas: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సలార్’ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా యొక్క సీక్వెల్ మరింత అదిరిపోతుందని అప్పట్లో చిత్ర యూనిట్ చెప్పింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాను ఇటు హీరో అటు దర్శకుడు ఇద్దరు కూడా పక్కన పెట్టినట్లుగా అర్థమవుతుంది. ప్రస్తుతం వారు ఈ సినిమాను కాకుండా వారు ఇప్పటికీ ఒప్పుకున్న వారి సినిమాలను, వాటి పనులను చేస్తూ ఉండడం ఈ చిత్రం ఎప్పుడు తెరకెక్కుతుందో అన్న సందేహాలను రేకెత్తిస్తుంది.

Prabhas and Prashanth Neel: What’s the Status of ‘Salaar 2’?

గత కొంతకాలంగా ఈ చిత్రం షూటింగ్ పట్ల ఎన్నో సందేహాలు నెలకొంటున్నాయి. ఒకసారేమో ఈ చిత్రం పూర్తిగా ఆగిపోయిందని అంటున్నారు.. ఇంకొకసారేమో ఈ సినిమా రేపో మాపో మొదలవుతుంది అని సర్ది చెబుతున్నారు. కానీ అప్పుడు ఇప్పుడు అని చెబుతున్నా కూడా ఈ సినిమా యొక్క షూటింగ్ ఇప్పటికీ కూడా మొదలు కాకపోవడం ప్రభాస్ అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది. ప్రశాంత్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన పనులను చేస్తున్నాడు. ఆ చిత్రం యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమై ఉన్నాడు.

Also Read: Vijay Deverakonda: విజయ్ దేవరకొండ తర్వాతే చరణ్,సుకుమార్ సినిమా!!

ఇటు ప్రభాస్ కూడా ఇతర సినిమాలను చేసే విధంగా తన క్యాలెండర్ను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే మారుతి చిత్రానికి సంబంధించిన షూటింగ్ను దాదాపుగా పూర్తి చేశాడు. ఇంకొన్ని రోజులు ఈ ఏడాదిలో కేటాయిస్తే ఆ చిత్రం పూర్తవుతుంది. ఇక వచ్చే ఏడాది హను రాఘవపూడి మరియు సందీప్ రెడ్డి వంగల సినిమాల కోసం ఆయన తన డేట్స్ ను కేటాయించబోతున్నాడు. ఆ విధంగా ఈ ఏడాది వచ్చే ఏడాది ఈ సినిమాలను చేస్తే ‘సలార్’ లాంటి భారీ అంచనాలు ఉన్న సినిమాను ఇంకెప్పుడూ చేస్తారు అనేది కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్న మాట .

అయితే ఈ సినిమా సడన్ గా హోల్డ్ అవ్వడానికి సరైన కారణం మాత్రం బయటకు రావడం లేదు. అసలు దీని గురించి మాట్లాడడానికి కూడా ఎవరు సంశయంగా లేరు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ ఈ సినిమా మొదలు పెట్టకపోవడానికి కారణమా లేదా ప్రభాస్ కారణమా అనే విషయం ఇప్పటిదాకా తేలీదు. చూస్తుంటే ఈ సినిమాను వారు ఇప్పట్లో పూర్తిచేసేలా కనిపించడం లేదని చెప్పాలి.