Prabhas and Trisha: Reuniting After 16 Years in 'Spirit'

Prabhas: ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే ఇప్పుడు పెద్ద సినిమాలు చేయడం కంటే చిన్న సినిమాలే చేయడం మేలు అన్నట్లుగా ఉంది. మొన్నటిదాకా భారీ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ ఇప్పుడు చిన్న సినిమాలు చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ఇప్పటికే ‘రాజాసాబ్’ అనే చిత్రాన్ని దాదాపుగా పూర్తి చేసిన ప్రభాస్ హను రాఘవపూడితో కలిసి మరొక చిన్న సినిమా చేయబోతున్నారు. ఇటీవల కల్కి సినిమాతో రెండవసారి 1000కోట్ల క్లబ్లోకి చేరిన ఏకైక హీరోగా రికార్డులను సృష్టించిన ప్రభాస్ ఈ విధంగా చిన్న సినిమాలు చేయడం ఆయన అభిమానులను ఓవైపు నిరాశపరిచిన ఇంకొక వైపు సంతోషపడుతున్నారు.

Prabhas and Trisha: Reuniting After 16 Years in ‘Spirit’

ఎందుకంటే చిన్న సినిమాలు చేయడం వల్ల ప్రభాస్ ను ఎక్కువ సినిమాలలో చూడవచ్చు అనేది వారి ఆలోచన. ఇక ఇప్పుడు అందరూ చూపు ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ చిత్రం పైనే ఉంది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతు ఉండగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి నెలలు గడిచిపోయాయి. ఈ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అన్న విషయమై ఇప్పటి దాకా క్లారిటీ లేదు. ఈ సినిమాలో నటించే విలన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క పాత్ర గురించి వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ఎంపిక అవుతుద్నని వార్తలు వస్తున్నాయి.

Also Read: Tollywood: ఆ మూడింటిలో మిస్టర్ బచ్చన్ కే బజ్ ఎక్కువ!!

నిజంగా ఇది అందరికీ షాక్ ఇచ్చే విషయం అనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి గతంలో మూడు సినిమాలు చేశారు. వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలలో కలిసిన నటించిన వీరు మళ్లీ 16 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారని చెబుతున్నారు. దీన్ని పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికీ త్రిష క్రేజీ హీరోయిన్ గా ఉన్నప్పటికీ ఆమె ఈ సినిమాలో నటిస్తే పెద్దగా బజ్ ఏర్పడదు అనేది వారి ఆలోచన.

అంతేకాదు ఈ సినిమాలో విలన్ గా కొరియన్ సినిమాలలో నటించి ‘డాంగ్ లీ’ ను ట్రై చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంకొక వైపు గోపీచంద్ ను కూడా ఈ సినిమాలో ఓ విలన్ పాత్ర కోసం ఎంపీక చేయబోతున్నారట.మరి ఇన్ని విశేషాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని క్యారెక్టర్ కావడంతో ఈ సినిమా పట్ల ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోలీస్ ఆఫీస్ గా ఈ సినిమాలో కనిపించాబోతునాడు.