Prabhas Heroine who is secretly engaged

Prabhas: ఈ మధ్యకాలంలో చాలామంది హీరో హీరోయిన్లు తమ పెళ్ళికి సంబంధించిన విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టకుండా రహస్యంగా అన్ని పనులు కానిచ్చాక పెళ్లి రేపు ఉందనగానో లేక పెళ్లి జరగాకనో ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నారు. కానీ అంతలోపే మీడియాలో వీరికి సంబంధించిన ఫోటోలు లీక్ అవుతూ ఉంటాయి.

Prabhas Heroine who is secretly engaged

అలా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలకు సంబంధించిన పర్సనల్ విషయాలు,పెళ్లి విషయాలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు రహస్యంగా ఆ హీరోయిన్ తన ప్రియుడితో నిశ్చితార్థం కూడా చేసుకున్నట్టు సమాచారం. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీలో నటించింది.ఇక ఇప్పటికే మీకు అందరికీ అర్థమై ఉంటుంది.(Prabhas)

Also Read: Vithika Sheru: వితికా రెండో పెళ్లి చేసుకోబోతుందా.. కొత్త ప్రయాణం అంటూ ఆ నటుడితో..?

ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ రీసెంట్ గా తన 34 బర్త్డే జరుపుకున్న సమయంలో తన ప్రియుడితో కనిపించిందనే వార్తలు బీటౌన్ లో చక్కర్లు కొట్టాయి. అయితే లండన్ కి చెందిన వ్యాపారవేత్త కొడుకు కబీర్ బహియాతో కృతి సనన్ డేటింగ్ చేస్తోందని,వీరిద్దరి మధ్య దాదాపు పది సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉన్నా కూడా ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. (Prabhas)

Prabhas Heroine who is secretly engaged

అయితే తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు సంచలన పోస్ట్ పెట్టారు. కబీర్ బహియా కృతి సనన్ ఎంగేజ్మెంట్ గ్రీస్ దేశంలో సీక్రెట్ గా జరిగింది అంటూ ఈయన పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే ఉమైర్ సందు పెట్టే పోస్టులన్నీ రూమర్లే అని ఇప్పటికే చాలాసార్లు క్లారిటీ వచ్చింది.మరి తాజాగా ఆయన పెట్టిన పోస్ట్ పై కృతి సనన్ ఏమైనా క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి.(Prabhas)