Vijay Deverakonda: A Film with Sukumar Before Charan's Turn

Vijay Deverakonda: సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ముఖ్యంగా సినిమాలు ఓకే అయ్యే విషయంలో, తెరకెక్కే విషయంలో, అవి విడుదలయ్యే విషయంలో వచ్చే సవాళ్లు మామూలుగా ఉండవు. గతంలో విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ ఓ సినిమా చేయవలసి ఉంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఒకసారి గా ఇంత పెద్ద డైరెక్టర్ సినిమా చేయడం విజయ్ దేవరకొండ అభిమానులను ఎంతగానో సంతోష పెట్టింది

Vijay Deverakonda: A Film with Sukumar Before Charan’s Turn

అయితే ఆ సంతోషం మూన్నాళ్ళ ముచ్చటే అయిందని చెప్పాలి. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ సినిమా వాయిదా పడిందని సుకుమార్ చరణ్ సినిమా చేయడానికి ఎక్కువ ముగ్గు చూపుతున్నాడని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారడం వరుసగా పాన్ ఇండియా దర్శకులు లైన్లోకి రావడంతో సుకుమార్ సినిమాను చేయాలా వద్దా అన్న ఆలోచనలు ఉన్నాడట. ఇంకొకవైపు సుకుమార్ కూడా పుష్ప రెండవ భాగం చిత్రం పనులలో నిమగ్నమై ఉన్నాడు

Also Read: Bhagyashri Borse: కృతి,శ్రీలీల లా భాగ్య శ్రీ బోర్సే అవ్వకూడదంటే!!

పుష్ప మొదటి భాగాన్ని చేస్తున్నప్పుడే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అందుకే విజయ్ దేవరకొండ తో చేయవలసిన సినిమాను వాయిదా వేశాడు. ఆ ప్లేస్లో పుష్ప రెండవ భాగం సినిమా చేయగా ఇప్పుడు రామ్ చరణ్ సినిమా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు చరణ్ ఖాళీగా లేకపోవడంతో మళ్లీ విజయ్ దేవరకొండ తోనే సినిమా చేసే విధంగా సుకుమార్ ఆలోచనలు చేస్తున్నాడు.

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ స్పోర్ట్స్ నేపథ్యంలోని ఓ సినిమాను ఇప్పటికే మొదలుపెట్టగా ఈ చిత్రం వచ్చే ఏడాది ఆఖరికి పూర్తవుతుంది. ఇక శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేజర్ చిత్రం డిసెంబర్లో విడుదల కాబోతుండగా తొందరలోనే ఈ చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టనున్నారు. ఆ విధంగా ఈ రెండు సంవత్సరాలు బిజీగా ఉంటున్నాడు సుకుమార్. ఈ ఏడాది పుష్ప రెండో భాగం సినిమాను పూర్తి చేయనుండడంతో చరణ్ వచ్చేదాకా ఖాళీగా ఉండడు కాబట్టి ఈలోగా విజయ్ దేవరకొండ సినిమా చేస్తాడా అనేది చూడాలి.