Saripodhaa Sanivaaram: నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన విడుదల కాబోతూ ఉండగా ఈ చిత్రంపై నాని అభిమానులు బాగానే అంచనాలు పెట్టుకున్నారని చెప్పాలి. గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలెక్కించలేకపోతున్నారు హీరో నాని. ఆయన గత చిత్రం ఆయన ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించడం తో ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా ఎలాగైనా విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

Can ‘Saripodhaa Sanivaaram’ Turn Nani’s Luck Around?

ఈ నేపథ్యంలోనే దర్శకుడు మీద నమ్మకంతో ఒక ఫ్లాప్ ఇచ్చిన కూడా అదే దర్శకుడుతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు నాని. ఆ విధంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సరిపోదా శనివారం అందుతుందని మొదటి నుంచి చిత్ర బృందం తెలియజేసే ప్రయత్నం చేయగా ఇప్పుడు ఈ సినిమా కోసం మాస్ ప్రేక్షకుల సైతం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. దాంతో ఎలాగైనా ఈ సినిమాను ప్రేక్షకులకు తెలిసేలా చేయాలని చిత్ర బృందం భావిస్తుంది.

Also Read: Akhil Akkineni: అదిగో.. ఇదిగో అంటున్న.. అఖిల్ సినిమా పత్తాలెక్కదేం!!

అందుకోసం పబ్లిసిటీ కోసం భారీ స్థాయిలో ఖర్చుపెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. పలు మీడియా సంస్థల్లో ఆర్టికల్స్ , అలాగే కవరేజ్ లు పాటు మరికొన్ని పబ్లిసిటీ స్టంట్ లు చేసే విధంగా నాని ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ కాకపోవడంతో ఈ విధంగా చేస్తున్నారట చిత్ర బృందం.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడంతో తలలు పట్టుకుంటున్న వీరు మళ్లీ ఇప్పుడు క్రియేట్ కాకపోవడం పట్ల మరింత టెన్షన్ పడుతున్నారట.

ఇక నాని మార్కెట్ కు చేసే సినిమాలకు పెద్దగా సంబంధం లేనట్లుగా పరిస్థితి ఉంది. ఆయన మార్కెట్ చాలా తక్కువ పరిధిలో ఉన్న నేపథ్యంలో చేసిన సినిమాల స్థాయి ఎక్కువగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆ విధంగా ఇప్పటికే రెండు సినిమాలు క్యాన్సl అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే దానియే దర్శకత్వంలో చేస్తున్న సినిమా బడ్జెట్ కారణంగానే క్యాన్సిల్ అయింది నాని బలగం చేయను సినిమా కూడా ఆకారణాలతోనే క్యాన్సిల్ అయింది అని చెప్పుకుంటున్నారు(Saripodhaa Sanivaaram)