Kishan Reddy: తెలంగాణ రాష్ట్రంలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. కొంతమంది నేతలు గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వదిలేసి కాంగ్రెస్లో చేరిపోయారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ బిజెపి పార్టీలో ముసలం నెలకొంది. ఉన్నది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వారిలో వారికే సఖ్యత లేదు. Kishan Reddy

Civil war in Telangana BJP Rebellion of 8 MLAs against Kishan Reddy

అంతేకాకుండా తెలంగాణ బిజెపి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా… 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారట. ఇటీవల బీజేపీ పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన ఒకేలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఒక్క బీజేపీ ఎమ్మెల్యే తప్ప… ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారట. Kishan Reddy

Also Read: BJP: బీజేపీలో గులాబీ పార్టీ విలీనం..సంచలన ప్రకటన చేసిన కేటీఆర్?

అయితే మొన్న తెలంగాణ గవర్నర్ ప్రమాణస్వీకారం సందర్భంగా తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేలను కిషన్ రెడ్డి అవమానించారట. బిజెపి ఎమ్మెల్యేలను తెలంగాణ గవర్నర్కు పరిచయం చేయించడంలో కిషన్ రెడ్డి ఈ విఫలమయ్యారట. దీంతో తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేలందరూ కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారట. Kishan Reddy

తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి… ఒంటెద్దు పోకడ తో వెళ్తున్నారట. ఇటు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా… బిజెపి లైన్ పాటించకుండా తనకు నచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇటు బిజెపి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్… అసెంబ్లీలో అసలు కనిపించకుండా… ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. ఇలా తెలంగాణ బిజెపి పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. Kishan Reddy