Is the hero Sumanth-Keerthi Reddy reason for divorce

Sumanth: అక్కినేని వారసత్వంగా ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో నాగార్జున తర్వాత ఆయన కొడుకులు నాగచైతన్య, అఖిల్ లు మాత్రమే కాకుండా నాగార్జున మేనల్లుళ్లు సుమంత్,సుశాంత్ లు కూడా ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలా సుమంత్ అప్పట్లో కొన్ని మంచి సినిమాల్లో హీరోగా రాణించారు. ఇక సుశాంత్ కొన్ని సినిమాలకే పరిమితమయ్యారు. అయితే అప్పట్లో సుమంత్ నటించిన చాలా వరకు సినిమాలు హిట్ అయ్యాయి. అలా స్టార్ హీరోగా ఇండస్ట్రీ లో రాణిస్తున్న తరుణంలోనే సుమంత్ పర్సనల్ లైఫ్,సినీ లైఫ్ రెండు డిజాస్టర్ అయిపోయాయి.

Is the hero Sumanth-Keerthi Reddy reason for divorce

ఆయన తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కానీ వీరిద్దరి పెళ్లి ఎన్ని రోజులో నిలువలేదు. పెళ్లయిన కొద్ది రోజులకే విడాకులు తీసుకున్నారు.అయితే వీరి విడాకులకు కారణం ఓ హీరోయిన్ పేరు గట్టిగా వినిపించింది. మరి ఆమె ఎవరు.. ఎందుకు వీరి మధ్య చిచ్చు పెట్టింది అనేది ఇప్పుడు చూద్దాం.. సుమంత్ కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నాక ఎక్కువ రోజులు కలిసి ఉండలేకపోయారు. (Sumanth)

Also Read: Tripti Dimri: బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతున్న యానిమల్ బ్యూటీ..?

దానికి కారణం సుమంత్ అక్క హీరోయిన్ సుప్రియ యార్లగడ్డ అని అప్పట్లో ఓ టాక్ వినిపించింది. అయితే సుప్రియ సుమంత్ కీర్తి రెడ్డిలకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు అన్ని విషయాల్లో కలగజేసుకునేదట. అయితే కీర్తి మాత్రం అన్నింటిలో ప్రైవసీ కావాలి అనుకునేదట. అయితే ఈ విషయంలో సుమంత్ కి కీర్తి కి మధ్య తరచూ గొడవలు జరిగేవట. అంతే కాకుండా సుమంత్ నటించిన సినిమాలు కొన్ని ప్లాఫ్ అవ్వడంతో కీర్తి రెడ్డి ఇద్దరం యూఎస్ఏ వెళ్ళిపోదాం అక్కడ జాబ్ చేసుకుందామని చెప్పిందట.

Is the hero Sumanth-Keerthi Reddy reason for divorce

కానీ సినిమాలను వదిలిపెట్టి ఇండియా ని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చేది లేదు అని కరాకండిగా చెప్పేశార. దాంతో ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువైపోయి విడాకులు తీసుకున్నారట. అలా వీరి విడాకుల సమయంలో సుప్రియ పేరు గట్టిగా వినిపించింది.ఇక విడాకులు తీసుకున్నాక కీర్తి రెడ్డి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. కానీ సుమంత్ మాత్రం ఇప్పటికీ సింగిల్గానే ఉంటున్నారు.(Sumanth)