Roja: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా.. ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయింది. మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి రోజా దారుణంగా ఓడిపోవడం జరిగింది. నగరి ఎమ్మెల్యేగా ముచ్చటగా మూడోసారి గెలుస్తుందని భావించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… ఆమెకు టికెట్ ఇచ్చారు. కానీ ఫలితాలు వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. Roja

Roja Dimmatirige shock for Jagan that hero jump into the party

నగరి ఎమ్మెల్యేగా గెలుస్తా అనుకున్నా రోజా బొక్క బోర్లా పడింది. కొంతమంది వైసిపి నేతలు, రోజా పనితీరు కారణంగా ఆమె.. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాజీ మంత్రి రోజా కంటికి బంగారమయ్యారు. మీడియా ముందుకు ఇప్పటివరకు రాలేదు రోజా. Roja

Also Read: CM Revanth Reddy: అమెరికా వెళ్లి తమ్ముళ్ళ కంపెనీ తెచ్చిన రేవంత్ రెడ్డి ?

తరచూ హైదరాబాద్ లేదా చెన్నైకి వెళ్తూ కాలం గడిపేస్తోంది మాజీ మంత్రి రోజా. ఇక ఇటీవల యూరప్ కు వెళ్ళిందట. అక్కడ దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో పొట్టి డ్రెస్సులు వేసుకున్న రోజా… ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇక దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. Roja

అయితే ఇలాంటి నేపథ్యంలో మాజీ మంత్రి రోజా గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. త్వరలోనే మాజీ మంత్రి రోజా… తమిళనాడు హీరో దళపతి విజయ్ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన పార్టీలో చేరి తమిళనాడులోని ఏదో ఒకచోట నుంచి పోటీ చేయాలని రోజా భావిస్తున్నారట. ఆ దిశగా చర్చలు జరుపుతున్నారట మాజీ మంత్రి రోజా. Roja