The star director who revealed the entire list of Sneha relation

Sneha: సీనియర్ నటి స్నేహ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సినీ ఇండస్ట్రీలో సంపాదించుకుంది.అలా ఈమె ప్రియమైన నీకు, రాజన్న, శ్రీరామదాసు, సంక్రాంతి, వెంకీ, ఏవండోయ్ శ్రీవారు, రాధాగోపాలం ఇలా ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ఎంతోమంది అప్పటి ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఎక్స్పోజింగ్ కి ఆమడ దూరంలో ఉంటూ సౌందర్య తర్వాత మళ్లీ అంతటి పాపులారిటీ తెచ్చుకుంది. అయితే అలాంటి స్నేహ బయటికి కనిపించే అంత సాఫ్ట్ కాదా..

The star director who revealed the entire list of Sneha relation

నిజంగానే ఆమెకు వారితో ఎఫైర్స్ ఉన్నాయా.. అనేది ఇప్పుడు చూద్దాం.. స్టార్ డైరెక్టర్ గీతా కృష్ణ గత కొద్ది రోజులుగా సినిమాలు తీయకుండా ఎంతోమంది సెలబ్రెటీల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన తెలియని విషయాలు బయటపెడుతూ సంచలనం సృష్టిస్తున్నారు. ఇక అప్పుడప్పుడు ఈయన మాట్లాడిన మాటలు వివాదాస్పదం కూడా అవుతున్నాయి.అయితే అలాంటి గీతా కృష్ణ రీసెంట్గా స్నేహ గురించి మాట్లాడుతూ స్నేహ పెళ్లికి ముందు కొంతమందితో ప్రేమాయణం నడిపించింది.(Sneha)

Also Read: Nagarjuna: శోభిత చాలా హాట్.. కొత్త కోడలుపై నాగార్జున షాకింగ్ కామెంట్స్..?

అలాంటి వారిలో ఓ ప్రొడ్యూసర్ ఉన్నారు. అయితే ఆ ప్రొడ్యూసర్ తో చాలా సంవత్సరాలు స్నేహ ప్రేమలో ఉంది.ఇక వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగాక పెళ్లి ముహూర్తం పెట్టుకుంటారు అనుకునే సమయంలో ఆ నిర్మాత నిజ స్వరూపం బయటపడి ఆయన్ని వదిలించేసుకుంది. ఎందుకంటే ఆయనకి అప్పటికే మరో అమ్మాయితో ఎఫైర్ ఉందట. ఇక దర్శకుడు సుశీ గణేషన్ కి స్నేహ అంటే చాలా ఇష్టం ఉండేది. స్నేహని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆయనే.

 The star director who revealed the entire list of Sneha relation

అలా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్నేహ అందానికి పడిపోయిన సుశీ గణేషన్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అంతేకాదు ఆమెపై ఉన్న ప్రేమతో వేరే వారితో ఆమె క్లోజ్ గా ఉంటే ఇష్టపడేవాడు కాదు.అలా ఓసారి ఓ హీరోతో చనువుగా ఉండడంతో అది చూసిన సుశీ గణేషన్ ఆమెను రక్తం వచ్చేలా కొట్టాడు. అదంతా పక్కన పెడితే ఎప్పుడైతే స్నేహ ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుందో అప్పటినుండి చాలా పద్ధతిగా ఉంటుంది. ఆమె జీవితం మొత్తం కుటుంబమే అన్నట్లుగా బతుకుతుంది. తన కుటుంబాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దింది. ప్రస్తుతం స్నేహ చాలా హ్యాపీగా ఉంది అంటూ గీతా కృష్ణ స్నేహ గురించి సంచలన కామెంట్స్ చేశారు.(Sneha)