Tripti Dimri who is going to marry a businessman

Tripti Dimri: ఒకే ఒక్క సినిమాతో రష్మిక ని వెనక్కి నెట్టేసి నేషనల్ క్రష్ అనే ట్యాగ్ తగిలించుకుంది యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.ఈ ముద్దుగుమ్మ అంతకుముందు ఎన్ని సినిమాల్లో చేసినా కూడా అస్సలు గుర్తింపు లేదు. కానీ ఒక్కసారిగా యానిమల్ మూవీలో రణ్బీర్ కపూర్ తో కలిసి బోల్డ్ గా నటించింది. ఇక ఒకే ఒక్క నైట్ లో ఈ ముద్దుగుమ్మకి ఎంత పాపులారిటీ వచ్చిందో చెప్పనక్కర్లేదు.ఇక ఈ పాపులారిటీని యూస్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అలాంటి సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా వాటిని యాక్సెప్ట్ చేస్తూ సినిమాల్లో నటిస్తూ పోతుంది.

Tripti Dimri who is going to marry a businessman

అలా ఈమె చేసిన సినిమాలు కూడా ప్రేక్షకులలు అంతగానే ఆదరిస్తూ హిట్ చేస్తున్నారు. ఇక రీసెంట్గా బ్యాడ్ న్యూజ్ సినిమా కూడా భారీ హిట్ అయింది.దాంతో త్రిప్తి డిమ్రీ పేరు బీటౌన్ లో వైరల్ అయిపోతుంది. వరుసగా అవకాశాలు కూడా ఈమె తలుపు తడుతున్నాయి. ఇక కేవలం బాలీవుడ్ లోనే కాదు ఈమెకు సౌత్ లో కూడా అవకాశాలు వెల్లువెత్తుతున్నట్టు తెలుస్తుంది. (Tripti Dimri)

Also Read: Raviteja: ఈ వయసులో ఆ రొమాన్స్ ఏంటి రాజా.. హరీష్ ధీటైన జవాబు!!

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేస్తూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఓ వ్యాపారవేత్తతో ఈ హీరోయిన్ ప్రేమలో ఉందని తెలుస్తోంది.అయితే వీరి రిలేషన్ చాలా సంవత్సరాల నుండి కొనసాగుతుందని తెలుస్తోంది.ఇక ఆయన ఎవరో కాదు ప్రముఖ బిజినెస్ మాన్ సామ్ మర్చంట్.. చాలామంది సెలెబ్రేటీలకు సామ్ మర్చంట్ తో అనుబంధం ఉంది.అయితే గత కొద్ది సంవత్సరాలుగా సామ్ మర్చంట్ తో త్రిప్తి డిమ్రీ ప్రేమలో ఉందని,వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్టు బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

Tripti Dimri who is going to marry a businessman

అయితే ఈమె యానిమల్ సినిమాతో హిట్టు కొట్టడంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి.చాలా రోజునుండి వీరిద్దరూ పార్టీలు, ఫంక్షన్లు, వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తూ వారి మధ్య ఉన్న బంధాన్ని అందరికీ తెలిసేలా చేస్తున్నారు. అంతే కాదు ఈ మధ్యకాలంలో పబ్లిక్ గా సామ్ మర్చంట్ తో త్రిప్తి డిమ్రీ ముంబై వీధుల్లో చాలాసార్లు మీడియా కంట పడింది. దాంతో త్వరలోనే వీరి పెళ్లి జరగబోతున్నట్టు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.(Tripti Dimri)