Team India: 1997 తర్వాత శ్రీలంక చేతిలో భారత్ వన్డే సిరీస్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే….. మూడు మ్యాచుల్లో రోహిత్ శర్మ ఒక్కడే కాస్త మంచిగా ఆడాడు. ఫస్ట్ వన్డేల్లో 58, సెకండ్ వన్డేల్లో 64, మూడో వన్డేల్లో 35 పరుగులతో టీమిండియా తరపున రోహిత్ శర్మ టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లు అంతా చేతులెత్తేశారు. Team India

Did team India lose badly because of these 3 reasons

మరి ముఖ్యంగా వన్డేల్లో నిలకడగా ఆడేటువంటి విరాట్ కోహ్లీ మూడు మ్యాచుల్లో కలిపి 58 పరుగులు మాత్రమే కొట్టాడు ఇంకా శుబ్ మన్ గిల్, శివమ్ దుబే, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి వారు అయితే కనీస స్థాయిలో కూడా ప్రదర్శన ఇవ్వలేదు. దీనివల్లే లంకపై ఒత్తిడి పెంచలేకపోయారు. లంక ఆటగాళ్లకు పిచ్ లో స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్నాయి. Team India

Also Read: Vinesh Phogat: వినేష్ ఫోగట్ పై వేటు.. ఇది బీజేపీ కుట్రనేనా ?

కానీ మన రెగ్యులర్ స్పిన్నర్లు అయినటువంటి కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లు కలిసి మూడు మ్యాచుల్లో సుమారు 10 వికెట్లు మాత్రమే పడగొట్టారు. సిరాజ్ మినహా మంచి వన్డే బౌలర్ టీమ్ లో లేరు. అయినప్పటికీ సిరాజ్ కూడా శ్రీలంకలో వికెట్ల వరద పారిస్తాడు అనుకుంటే పారిపోయాడు. భారత బాటలో స్పిన్ ఉచ్చులో పడిపోయారు. Team India

టీ20లో లాగా భారీ షాట్ లకు ప్రయత్నిస్తే వికెట్లు పడిపోయాయి. మూడు మ్యాచుల్లో 30 వికెట్లు ఉంటే లంక స్పిన్నర్లే 27 వికెట్లు పడగొట్టారు. ఇక్కడే భారత్ ఓడిపోయింది. ఈ స్పిన్ ను ఎలా డిపెండ్ చేయాలో తెలియకపోవడం భారత్ కు పెద్ద మైనస్. కనీసం కోహ్లీ లాంటి నిలకడైన ప్లేయర్ క్రీజులో ఎక్కువసేపు ఉండాల్సింది కానీ దురదృష్టవశాత్తు లేడు. ఇలా ప్రధానంగా ఇలాంటి కారణాలవల్లే టీమిండియా సిరీస్ కోల్పోయింది. Team India