Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు మాత్రమే వైసిపి పార్టీకి రావడం జరిగింది. అలాగే నాలుగు ఎంపీ స్థానాలు మాత్రమే వైసిపి పార్టీ గెలుచుకోవడం జరిగింది. అయితే వైసిపి పార్టీ ఓడిపోయిన తర్వాత… అందులో ఉన్న నాయకులను తెలుగుదేశం కూటమి బాగా టార్గెట్ చేస్తోంది. Jagan

Jagan rebellion against Modi Talks with Rahul in Bangalore

కేసులు పెట్టి వేధిస్తోంది. ఆస్తులు ధ్వంసం చేస్తోంది. వైసిపి నేతలపై దాడులు కూడా చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా… జగన్మోహన్ రెడ్డి పని చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. Jagan

Also Read: Kishan Reddy: తెలంగాణ బీజేపీలో అంతర్యుద్ధం.. కిషన్ రెడ్డిపై 8 మంది ఎమ్యెల్యేలు తిరుగుబాటు ?

వకఫు బోర్డ్ బిల్లు అలాగే ఇతర కొత్త బిల్లులు తీసుకువచ్చిన కూడా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని జగన్మోహన్ రెడ్డి….ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. 2019 నుంచి 2024 వరకు… మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి ఓటు వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏపీ పరిస్థితి మారిపోయాయి. Jagan

తెలుగుదేశం కూటమితో బిజెపి జత కట్టడంతో ఇప్పుడు మోడీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న రాహుల్ గాంధీ వెంటనే జగన్మోహన్రెడ్డిని కలవాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే శనివారం లేదా ఆదివారం రోజున బెంగళూరులోని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కు రాహుల్ గాంధీ వెళ్లనున్నారట. ఇండియా కూటమితో జగన్మోహన్ రెడ్డి నడవాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కోరనున్నారట. Jagan