Kalyan Ram who gets angry when Balayya's name is mentioned

Kalyan Ram: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తమ్ముడి కోసం నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారనే వార్త గత కొద్ది రోజులుగా చాలా వైరల్ అవుతుంది. ఎప్పుడైతే హరికృష్ణ మరణించారో అప్పటినుండి హరికృష్ణ ఇద్దరు కొడుకులను నందమూరి ఫ్యామిలీ దూరం పెడుతుంది. ముఖ్యంగా బాలకృష్ణ వీరిని దూరం పెట్టారనే చర్చలు ఇండస్ట్రీలో జరుగుతున్నాయి. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ అస్సలు ఓర్వలేకపోతున్నారని,

Kalyan Ram who gets angry when Balayya’s name is mentioned

ఆయన ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారని ఇలా ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అలాగే తారకరత్న మరణించిన సమయంలో బాబాయి వస్తున్నాడని పెద్దవాడు కాబట్టి లేచి నిల్చుంటే వారిని కనీసం పలకరించకుండానే బాలకృష్ణ వెళ్లిపోయిన వీడియోలు మనం ఇప్పటికీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం.అలాగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కూడా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరూ దూరంగా ఉన్నారు.అయితే వీరికి ఆహ్వానం అందినా కూడా బాలకృష్ణ కారణంగానే రాలేదు అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.(Kalyan Ram)

Also Read: Samantha: చైతూ పెద్ద సైకో.. శోభిత కు కూడా సమంత గతే పడుతుంది..?

ఇక ఇప్పుడు బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ వేడుకల్లో కూడా వీరిద్దరికి ఆహ్వానం లేనట్టు తెలుస్తుంది.ఈ విషయం పక్కన పెడితే..బాలకృష్ణ పేరు చెబితేనే కళ్యాణ్ రామ్ చాలా మండిపోతున్నారట.. అయితే ఇది పాత విషయం. కానీ మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అదేంటంటే..డెవిల్ సినిమా చేసే సమయంలో ఆ మూవీ కి 80 శాతం షూటింగ్ ని నవీన్ మేడారం అనే డైరెక్టర్ తెరకెక్కించారు.

Kalyan Ram who gets angry when Balayya's name is mentioned

కానీ ఆ తర్వాత విభేదాలు రావడంతో ఈ సినిమా నిర్మాత అభిషేక్ నామా సినిమా నుండి డైరెక్టర్ ని తొలగించి ఇంకో 20% సినిమాని ఆయనే తెరకెక్కించారు అయితే ఈ సినిమా రిజల్టు ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణను ముఖ్య అతిథిగా పిలుద్దామని అభిషేక్ నామా కళ్యాణ్ రామ్ దగ్గర ప్రస్తావించారట. కానీ అప్పటికే కుటుంబ గొడవల్లో ఉన్న కళ్యాణ్ రామ్ బాలకృష్ణ వద్దు ఎవరు వద్దు అని మండిపడ్డారట. అయితే ఆ సినిమా సమయంలో జరిగిన విషయం మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.(Kalyan Ram)