Keerthy Suresh is not single.. Is the relationship with that hero real

Keerthy Suresh: నేను శైలజ,మహానటి, నేను లోకల్, సర్కార్ వారి పాట,రెమో, రైల్, దసరా వంటి ఎన్నో సినిమాలతో స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ లో దూసుకుపోయిన ముద్దుగుమ్మ త్వరలోనే బాలీవుడ్ సినిమా ద్వారా అక్కడ కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది.అయితే ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ కూడా జరుపుకుంటుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను సింగల్ కాదు సింగిల్ అని మీకు ఎవరు చెప్పారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ఇంతకీ కీర్తి సురేష్ ఎవరితో రిలేషన్ లో ఉంది అనేది ఇప్పుడు చూద్దాం..

Keerthy Suresh is not single.. Is the relationship with that hero real

మలయాళ హీరోయిన్ మేనక కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ అందం అభినయానికి ఎంతో మంది ఆకర్షితులయ్యారు. అలా ఈమె అందానికి ఫిదా అయినా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి బయోపిక్ లో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. ఎప్పుడైతే మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి మూవీలో నటించిందో ఆ సినిమాతో కీర్తి సురేష్ కి ఎక్కడలేని క్రేజ్ వచ్చి పడింది. అలా ఈమె తన స్టార్డంని ఇప్పటివరకు కొనసాగిస్తుంది. ఇక గత నాని తో వచ్చిన దసరా లో డీ గ్లామరస్ గా కనిపించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.(Keerthy Suresh)

Also Read: Sobhitha: ఎంగేజ్మెంట్ అయిన వెంటనే శోభిత బయట పెట్టిన షాకింగ్ సీక్రెట్..?

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ ప్రశ్న ఎదురయింది.మీరు ఇంకా ఎందుకు సింగిల్ గా ఉంటున్నారు బోర్ కొట్టడం లేదా అని ఓ జర్నలిస్ట్ అడగగా.. నేను సింగిల్ అని మీకు ఎవరు చెప్పారు.. అయినా పెళ్లి అనేది రెండు మనసులు కలవాలి. అలాగే ఇద్దరు మనుషుల మధ్య పరస్పర అవగాహన కూడా ఉండాలి. అలా అయితేనే పెళ్లి బంధానికి వ్యాల్యూ ఉంటుంది..అంటూ కీర్తి సురేష్ చెప్పింది.

Keerthy Suresh is not single.. Is the relationship with that hero real

అయితే కీర్తి సురేష్ నేను సింగిల్ కాదు అంటూ చెప్పడంతో అభిమానుల్లో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుండి కీర్తి సురేష్ ఓ హీరోతో రిలేషన్ లో ఉందని కొన్ని ప్రచారాలు జరుగుతుంటే మరికొంత మందేమో చెన్నైకి చెందిన ఓ రిసార్ట్ ఓనర్ తో కీర్తి సురేష్ లవ్ లో ఉందని మరికొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ చెప్పిన ఆన్సర్ విని చాలామంది నిజంగానే కీర్తి సురేష్ రిసార్టు ఓనర్ తో ప్రేమలో ఉంది.సింగిల్ కాదు అని చెప్పకనే చెప్పేసింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంతకీ కీర్తి సురేష్ ఎవరితో రిలేషన్ లో ఉందో తెలియాల్సి ఉంది.(Keerthy Suresh)