Chandrababu: తెలంగాణపై టీడీపీ ఫోకస్ పెట్టింది. పార్టీ జెండా ఎగిరి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. దశాబ్ద కాలంగా తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ ఇకపై తెలంగాణ గడ్డపై కూడా ఫోకస్ పెట్టాలని చూస్తోంది. అమరావతి వేదికగా జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో మీటింగ్ లో ఈ అంశం చర్చకు వచ్చింది. తెలంగాణలో ఇప్పటికే 10 శాతానికి పైగా ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉండడంతో పార్టీని పక్క రాష్ట్రంలోకి యాక్టివ్ గా చేయాలని నిర్ణయానికి వచ్చింది అధినాయకత్వం. టీడీపీ నాయకత్వం తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావాలని తీర్మానించారు టిడిపి అధినేత. Chandrababu

TDP re-entry in Telangana will it also come to power

తెలంగాణపై ఫోకస్ పెడితే ఎక్కడి నుంచి ఎప్పటినుంచి రంగంలోకి దిగుతారు అనేది ఆసక్తికరంగా మారింది. గ్రామస్థాయిలో టీడీపీ క్యాడర్ అంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు పార్టీని తిరిగి తెలంగాణలో యాక్టివ్ గా చేయాలని చూస్తున్నారు. ఇతర పార్టీలో చేరిన వాళ్లు అంతా తిరిగి సొంత బూత్ కి వస్తే గ్రామపంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను తిరిగి బరిలోకి దించాలి అనే ఆలోచనలో టీడీపీ నాయకత్వం ఉందని అంటున్నారు. అయితే గ్రామస్థాయిలో పార్టీ క్యాడర్ అంత చీలిపోవడంతో మున్సిపల్ జడ్పీ ఎన్నికల్లో పోటీ పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో ఉన్నారట చంద్రబాబు నాయుడు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి రాష్ట్ర అధ్యక్షుడు, కార్యవర్గం, బలమైన రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ తరపున టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఎల్ రమణ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో కాసాని జ్ఞానేశ్వర్ ని అధ్యక్షుడిగా చేర్చారు. Chandrababu

Also Read: Jagan: మోడీపై జగన్ తిరుగుబాటు.. బెంగళూరులో రాహుల్ తో చర్చలు ?

కాసాని ఎంట్రీతో తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటుంది అని పార్టీ అభిమానులు భావించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలి అన్న టీడీపీ నిర్ణయంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ కూడా బీఆర్ఎస్ లో చేరారు. దాంతో నరసింహులుకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ టీడీపీ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జాతీయ పార్టీగా దేశంలో మరింత ఎక్స్పోజ్ కావాలంటే తెలంగాణలోనూ టీడీపీ కీలకపాత్ర పోషించాల్సిందేనని పార్టీ నేతలు చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనపడడం…. మరోవైపు తమ మిత్రపక్షమైన బీజేపీ బలపడుతుండడంతో రీఎంట్రీకి ఇదే పర్ఫెక్ట్ టైమ్ అన్న ఆలోచనతో టీడీపీ ఉందట. Chandrababu

పార్టీకి పూర్వ వైభవం కోసం మొదటి నుంచి ఉన్న కార్యకర్తలను కాపాడుకోవడంతో పాటు గ్రామస్థాయిలో పసుపు జెండా మోసే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు టీడీపీ అభ్యర్థి చంద్రబాబు. అవసరమైతే కొందరికి ఏపీలో నామినేటెడ్ పోస్టులు ఇచ్చి వారి ద్వారా తెలంగాణలో టీడీపీ జెండాను బలోపేతం చేయాలని అనుకుంటున్నారు. ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన చంద్రబాబు ఇక్కడ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ అధ్యక్షుడు నియామకం, సభ్యత్వ నమోదుపై చర్చించారు. పోలీస్ బ్యూరో సమావేశంలో కూడా తెలంగాణ పార్టీ బలోపేతానికి మొగ్గు చూపడంతో త్వరలోనే దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ రెడీ చేయబోతున్నారు. మొత్తానికి దశాబ్ద కాలంగా తెలంగాణకు దూరంగా ఉన్న టీడీపీ త్వరలోనే మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. Chandrababu