Team India: కొంతకాలంగా టీమ్ ఇండియా బిజీ బిజీగా గడిపింది. సిరీస్ ల మీద సిరీస్ లు ఆడింది. ముందుగా ఈ ఏడాది ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ తో కనువిందు చేసింది. ఆ తర్వాత భారత ఆటగాళ్లు ఐపీఎల్ లో బరిలోకి దిగారు. ఆ వెంటనే టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా ఫ్లైట్ ఎక్కారు. యూఎస్ఏ వెస్టిండీస్ ఆతిధ్యం ఇచ్చిన టోర్నీలో టీమ్ ఇండియా దుమ్మురేపింది. ఏకంగా ఛాంపియన్ గా నిలిచింది. ఆ తర్వాత యువ భారతజట్టు జింబాబ్వే టూర్ కు వెళ్ళింది 5 టీ20ల సిరీస్ ఆడింది. ఆ తర్వాత శ్రీలంక టూర్ కు భారత జట్టు బయలుదేరింది. Team India

42 days vacation for team India players

అక్కడ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. టీ20లో భారత జట్టును సూర్యకుమార్ యాదవ్ ముందుండి నడిపించారు. హెడ్ కోచ్ గంభీర్ ఎంట్రీ ఇచ్చింది కూడా లంక సిరీస్ తోనే. మూడు మ్యాచుల టీ20 సిరీస్ గెలిచిన భారత్ కు వన్డే సిరీస్ లో మాత్రం షాక్ తప్పలేదు. 02తో వన్డే సిరీస్ ను భారత్ కోల్పోయింది. శ్రీలంకతో ఆఖరి వన్డే ఆగస్టు 7న జరిగింది. అయితే లంక టూర్ తర్వాత టీమ్ ఇండియాకు ఇప్పుడప్పుడే మ్యాచ్ లు లేవు. దాదాపుగా 42 రోజుల లాంగ్ బ్రేక్ దొరికింది. భారత ఆటగాళ్ల ఆట కోసం మరింత కాలం ఆగాల్సిందే. Team India

Also Read: IPL 2025: ఐపీఎల్ లో కొత్త రూల్… ప్లేయర్లకు తీవ్ర అన్యాయం ?

ఈ నెలలో భారత్ జట్టుకు ఇంకా సిరీస్ లు ఏమీ లేవు. వచ్చే నెలలోనే మళ్లీ బరిలోకి దిగబోతోంది. బంగ్లాదేశ్ సిరీస్ తో అభిమానులను ఖుషి చేయనుంది. బంగ్లాదేశ్ తో భారత జట్టు రెండు టెస్టులు మూడు టీ20లు ఆడనుంది. మొదటి టెస్ట్ సెప్టెంబర్ 19వ తేదీన చెన్నైలో ప్రారంభం అవుతుంది. కాన్పూర్ లో సెప్టెంబర్ 27వ తేదీన ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 6వ తేదీన టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి టీ20కి ధర్మశాల ఆతిథ్యం ఇస్తుంది. ఢిల్లీలో అక్టోబర్ 9వ తేదీన రెండవ టీ20 జరగనుంది. మూడవ టీ20 మాత్రం హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. మూడవ టీ20 అక్టోబర్ 12వ తేదీన జరగనుంది. Team India

ఆ తర్వాత భారత పర్యటనకు న్యూజిలాండ్ వస్తుంది. భారత్ లో మూడు టెస్టులు ఆడుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్తుంది. కంగారు గడ్డపై ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతుంది. నవంబర్ 22న 5 మ్యాచుల టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో టీమిండియా ఇంగ్లాండ్ మధ్య 5 టీ20 సిరీస్ తో పాటు మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. మొత్తంగా 42 రోజుల రెస్ట్ తర్వాత భారత్ జట్టు ఫుల్ బిజీ కానుంది. సిరీస్ ల మీద సిరీస్ లతో ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చెయ్యనుంది. Team India