Can Puri Jagannadh Bounce Back with 'Double iSmart'

Puri Jagannadh: తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడుగా తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు పూరీ జగన్నాథ్. అయితే గత కొన్ని సినిమాలుగా ఆయన ప్రేక్షకులను ఏమాత్రం అలరించకపోవడంతో ఆయన అభిమానులు ఎంతో నిరాశతో ఉన్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఆయనకు దర్శకుడుగా పునర్జన్మను ఇచ్చిందని చెప్పాలి. అయితే ఆ తర్వాత చేసిన ‘లైగర్’ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పూరి లాంటి దర్శకుడు చేసిన ఈ సినిమా అందరిని నిరాశకు గురి చేసింది.

Can Puri Jagannadh Bounce Back with ‘Double iSmart’

ఈ సినిమాతో ఒక్కసారిగా తన దర్శకత్వంపై ప్రతి ఒక్కరికి అనుమానం కలిగింది. పూరి జగన్నాథ్ లో సత్తా అయిపోయిందని, ఇకపై ఆయన సినిమాలు చేయడానికి పనికిరాడు అని చాలామంది కామెంట్ చేశారు. కానీ దాని నుంచి కోలుకొని ఆయన ఇప్పుడు ‘డబల్ ఇస్మార్ట్’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా పూరి జగన్నాథ్ కెరీర్ ఏవిధంగా ముందుకు తీసుకుపోతుందో అన్న ఆశలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి.

Also Read: Chiranjeevi: చిరంజీవి ఆశలన్నీ విశ్వంభర పైనే!!

ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఎంతో గ్రాండ్ గా జరగగా ఈ సినిమా యొక్క ఫలితం పై తాను ఎంతో హ్యాపీగా ఎదురుచూస్తున్నానని పూరి జగన్నాథ్ తెలిపారు. అంతేకాదు ఆయన ఇన్ని రోజులు గడిపిన జీవితాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏదేమైనా పూరి జగన్నాథ్ ఈ సినిమాతో విజయాన్ని అందుకోవాలని చాలా మంది భావిస్తున్నారు. ఇలాంటి దర్శకుడు ఇంకా మంచి సినిమాలు చేయాలని చెబుతున్న నేపథ్యంలో పూరీ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అన్నది అనుమానంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల ను ఆకట్టుకోలేక పోయిన నేపథ్యం లో సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి.