Chiranjeevi Hopes on Vishwambhara Movie

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. త్రిష కథానాయక నటిస్తున్న ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం అందిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఓ ఫాంటసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిరంజీవి ఈ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారు. ఆయన హీరోగా నటించిన గత కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయాయి. దాంతో ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని మెప్పించాలని భావిస్తున్నారు.

Chiranjeevi Hopes on Vishwambhara Movie

అందుకే ఈ సినిమా కోసం ఆయన గట్టిగానే కష్టపడుతున్నారని తెలుస్తుంది. గతంలో ఆయన ‘అంజి’ అనే ఫాంటసీ సినిమా తో ప్రేక్షకులను అలరించారు. ఆ విధంగా ఆయన ఇప్పుడు చేసిన ఈ ‘విశ్వంభర’ సినిమా పై ఆశలు బాగానే పెట్టుకున్నారని చెప్పాలి. ఇటు అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర బృందం ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది.

Also Read: Pawan Kalyan: పవన్ రెండు పడవల ప్రయాణం.. వర్కౌట్ అయ్యేనా!!

దీనికి సంబంధించిన షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. దర్శకుడు కూడా ఈ చిత్రం యొక్క కథను వేరే స్థాయిలో రూపొందించాడని తెలుస్తుంది. ‘బింబిసారా’ సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడైన వశిష్ట ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను మళ్ళీ ఆకట్టుకుంటాడా అనేది చూడాలి. మెగాస్టార్ చిరంజీవి నటించిన గత సినిమా ‘భోలా శంకర్’ ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది. వాల్తేరు వీరయ్య సినిమా పర్వాలేదనిపించుకోగా మెగా అభిమానుల కడుపునింపే సినిమా మాత్రం ఇప్పటిదాకా రాలేదని చెప్పాలి.

అందుకే ఈ సినిమా కోసం ఆయన ఎంతో శ్రమిస్తున్నారని తెలుస్తుంది. కీరవాణి సంగీతం సమకూరుస్తూ ఉండగా ఈ చిత్రం పలు కీలకమై అద్భుతమైన లొకేషన్స్ లో తెరకెక్కుతుందని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నిర్మాతలు ప్రకటించనున్నారు.