Mithun Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని అందరిలోనూ టెన్షన్ నెలకొంది. వైసిపి పార్టీ అధికారం కోల్పోవడంతో…ఆ పార్టీలో ఓడిపోయిన నేతలందరూ… సైలెంట్ అయిపోయారు. గెలిచిన నేతలందరూ.. ఛాన్స్ వస్తే కూటమిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట.అయితే ఇలాంటి నేపథ్యంలో… పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డికి బిజెపి నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందట. Mithun Reddy

Peddireddy And Son Mithun Reddy To Join The BJP

ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మిథున్ రెడ్డి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత… పెద్దిరెడ్డి కుటుంబం మొత్తం బిజెపిలోకి వెళుతుందని ప్రచారం జరిగింది. ముఖ్యంగా మిథున్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నారని కూడా జోరుగా.. వార్తలురావడం జరిగింది. Mithun Reddy

Also Read: Chandrababu: తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ…అధికారంలోకి కూడా రానుందా?

అయితే ఈ వార్తల నేపథ్యంలో తాజాగా.. వైసిపి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి… తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడని తెలిపాడు. మూడుసార్లు ఎంపీగా గెలిచానని కూడా గుర్తు చేశారు మిథున్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని తాను ఎప్పుడు కూడా విడబోనని ప్రకటించారు. Mithun Reddy

2024 లోనే కాదు 2014 నుంచి తనకు బిజెపి నుంచి ఆఫర్లు వస్తున్నాయని తెలిపాడు. 2014 ఆ సమయంలోనే కేంద్ర మంత్రి ఇస్తామని.. బిజెపి ఆఫర్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి. ఇక ఇప్పుడు కూడా అదే ప్రచారం జోరుగా సాగుతోందని… తాను పార్టీ మారబోనని తెలిపారు. Mithun Reddy