Ravi Teja Skips 'Mister Bachchan' Promotions

Raviteja: ఆగస్టు 15వ తేదీన పలు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నేపథ్యంలో టాలీవుడ్ ప్రేక్షకులు వారి వారి వీకెండ్ ను ఎంతో బాగా ఉండేలా ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఆ విధంగా రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతూ ఉండగా ఈ సినిమా పట్ల అందరిలో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని సినిమాలుగా రవితేజ ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోతున్నాడు. దాంతో ఆయన సినిమాల ఎంపిక పట్ల ప్రతి ఒక్కరిలో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా పట్ల ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్నాడు.

RaviTeja Skips ‘Mister Bachchan’ Promotions

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు అప్డేట్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు మంచి పాజిటివిటి ఏర్పడగా ఈ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకోవాలని రవితేజ భావిస్తున్నాడు. ఆయన అభిమానులు కూడా ఆయన నుంచి ఒక హిట్ సినిమా వచ్చి చాలా రోజులే అయిపోయిందని భావిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా వారి ఆకలని తీర్చే విధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న భాగ్యశ్రీ మరొక ఆకర్షణ కాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను దర్శకుడు హరీష్ శంకర్ భుజనా వేసుకొని ముందుకు నడిపిస్తున్నారు.

Also Read: Allu Arjun: పుష్ప నే నమ్ముకున్న బన్నీ.. తేడా కొడితే అంతే సంగతులు!!

కాస్త కూస్తో హీరోయిన్ చేయి వేస్తున్న కూడా పూర్తి భారమంత హరీష్ శంకర్ పైనే ఉంటుందని చెప్పాలి. వాస్తవానికి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ముందుకు నడిపించేది హీరోనే.. హీరో ఎంత ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తే ఆ సినిమాకు అంతటి బజ్ ఏర్పడుతుంది. అలా కాకుండా రవితేజ ఇప్పటి దాకా ప్రమోషన్ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కాకపోవడం సినిమాకు ఏమైనా మైనస్ అవుతుందా అనేది చూడాలి. ఇకపోతే రవితేజ చిన్న చిన్న ఫంక్షన్లకు హాజరు కాకపోవడానికి కారణాలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోల్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ ఈవెంట్ లలో ఏం మాట్లాడినా కూడా అవి ట్రోల్స్ కి గురవుతున్నాయి. అవి సినిమా పట్ల ఎంతో ఎఫెక్ట్ పడుతున్నాయి. ఆ విధంగా రవితేజ చిన్న చిన్న ఫంక్షన్లలో ఏదైనా మాట్లాడి అదే ట్రోల్ కి గురయ్యే బదులు పెద్కుద ఈవెంట్ కి వచ్చి మాట్లాడడమే బెటర్ అని అనుకున్నాడట. అందుకే ఆయన ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనడం లేదని చెబుతున్నారు. కొన్ని ప్రైవేటు ఇంటర్వ్యూ లలో మాత్రమే అయన పాల్గొంటున్నారు. పోతే పబ్లిక్ ఈవెంట్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే అయన కనిపిస్తారట. భవిష్యత్ లో అందరు హీరోలు అలాంటే చేస్తారేమో చూడాలి.