Cm Reavanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గులాబీ పార్టీని టార్గెట్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే ఇప్పటికే 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. మరికొంతమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే విలీన ప్రక్రియ చేయాలని రేవంత్ రెడ్డి స్కెచ్ లు వేస్తున్నారు. Cm Reavanth Reddy

Revanth Reddy big sketch Will etala join the Congress

అయితే గత నెల రోజులుగా టిఆర్ఎస్ నుంచి వచ్చే.. నేతలు ఆగిపోయారు. ఎవరు కూడా గులాబీ పార్టీలో చేరడం లేదు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్ కారణంగా ఈ పరిస్థితి నెలకొంది అని కొంతమంది అంటున్నారు. అయితే గులాబీ పార్టీని కొన్ని రోజులు వదిలేసిన రేవంత్ రెడ్డి… ఇప్పుడు బిజెపి పార్టీ పైన పడ్డారు. Cm Reavanth Reddy

Also Read: Jagan: ప్రతిపక్ష హోదా చిచ్చు… జగన్ కు అయ్యన్నపాత్రుడు బంపర్ ఆఫర్ ?

ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈటల రాజేందర్ కు బిజెపిలో పెద్దగా ప్రాధాన్యత ఉండటం లేదని సమాచారం. బిజెపి పాత నేతలు అందరూ కలిసి ఈటల రాజేందర్ ను.. అసలు పట్టించుకోవడం లేదట. Cm Reavanth Reddy

ఆయనకు కేంద్ర మంత్రి పదవి రాకుండా కూడా అడ్డుకున్నారట. దీంతో బిజెపి లో కాస్త అసంతృప్తిగా ఈటల రాజేందర్ ఉన్న నేపథ్యంలో… ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారట రేవంత్ రెడ్డి. అయితే దీనిపై ఈటల రాజేందర్ ఎలా స్పందిస్తారో చూడాలి. Cm Reavanth Reddy