Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన కెరీర్‌లో బిజీగా ఉంది. ఆమెకు మునుపటికంటే ఎక్కువగా సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటూ బిజీగా ఉంది. గత కొన్ని రోజులుగా సమంత సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం నాగచైతన్య పెళ్లి. అయన శోభిత ధూళిపాళ్ళ ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సమంత కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాజాగా సమంత రెండో పెళ్లి చేసుకోబోతోందనే వార్త హల్‌చల్ చేస్తోంది.

Samantha Reacts to Fan’s Proposal Amid Rumors of Her Second Marriage

నాగ చైతన్య నటి శోభితను రెండో పెళ్లి చేసుకోబోతున్న తరుణంలో సమంత తన రెండో పెళ్లికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. కానీ ఆమె ఎప్పుడు చేసుకుంటుంది అన్న విషయమై క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఆమె నిర్ణయాన్ని అభిమానులు దాదాపుగా హర్షించారు. ఓ  ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సమంతపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియో చేశాడు.

Also Read: Nithya Menen: పెళ్లయిన హీరో పై మోజు పడ్డ నిత్యామీనన్..?

ఈ వీడియోలో…సామ్ నువ్వు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను. మీరు నన్ను కలిస్తే మంచి ఐడియా ఇస్తాను. నాకు ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల సమయం ఇవ్వండి. నేను డబ్బు సంపాదించి మీ వద్దకు వస్తాను అప్పటి వరకు నా హృదయాన్ని గుర్తు పెట్టుకోండి.. దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి సామ్. అని పోస్ట్ చేశాడు.

సమంత వీడియో చూడటమే కాదు రిప్లై కూడా ఇచ్చింది. మీ బ్యాక్ గ్రౌండ్ లో జిమ్ కనిపిస్తోంది ఆల్మోస్ట్ నేను కన్విన్స్ అయ్యాను అంటూ రిప్లై ఇవ్వడంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేవు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.