Samyuktha Menon made a shocking decision to divorce her mother

Samyuktha Menon: మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు.ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన భీమ్లా నాయక్ సినిమాలో విలన్ రానాకి భార్యగా మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. అలా ఈ సినిమా తర్వాత సంయుక్త మీనన్ కి వరుస సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. ఇక ఈమె నటించిన బింబిసారా, డెవిల్,విరూపాక్ష, సార్ వంటి సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాయి. దాంతో ఈ ముద్దుగుమ్మ పేరు ఎక్కడికో వెళ్లిపోయింది.

Samyuktha Menon made a shocking decision to divorce her mother

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి మొదట ఎంట్రీ ఇచ్చింది మాత్రం మలయాళ పాప్ కార్న్ మూవీ తో..ఆ తర్వాత మలయాళ,తమిళ భాషల్లో రాణించి తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.అయితే తెలుగులో సంయుక్త మీనన్ కి మంచి పేరు రావడంతో వరుస ఆఫర్స్ వెల్లువెత్తాయి.అలా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కొన్ని సినిమాల్లో చేస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ హీరోయిన్ కి సంబంధించిన ఎలాంటి న్యూస్ ఎక్కువగా వినిపించడం లేదు.(Samyuktha Menon)

Also Read: Anjali: అంజలిని ఫుల్లుగా వాడేసి బ్రేకప్ చెప్పిన హీరో..?

అయితే ప్రస్తుతం సంయుక్త నిఖిల్ హీరోగా చేస్తున్న పాన్ ఇండియా మూవీ స్వయంభు లో హీరోయిన్ గా చేస్తుంది. అలాగే మరికొద్ది రోజుల్లో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక ఈమె సినీ లైఫ్ అటు ఉంచితే.. పర్సనల్ లైఫ్ లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసిందట.మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు విడిపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడిందట. అయితే ఇదే విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో సంయుక్త మీనన్ మాట్లాడుతూ..మా అమ్మ నాన్న విడిపోయాక చాలా బాధపడ్డాను.

Samyuktha Menon made a shocking decision to divorce her mother

కానీ నాకు అమ్మంటే చాలా ఇష్టం.అందుకే నా పేరులో నుండి నాన్నకు సంబంధించిన సర్ నేను తీసేసాను. ప్రస్తుతం నేను సంయుక్తనే అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. అలాగే తన పర్సనల్ లైఫ్ లో అలా జరిగిందని సమాజంలో ఉండే అబ్బాయిలు అందరూ అలా ఉంటారని నేను అనుకోను.కేవలం ఈ సంఘటన నా కుటుంబం వరకు మాత్రమే అని భావిస్తాను.. అంటూ సంయుక్త మీనన్ చెప్పుకొచ్చింది.అయితే చాలా రోజులుగా సంయుక్త మీనన్ గా పేరున్న ఈ హీరోయిన్ తన పేరు నుండి మీనన్ అనే పదాన్ని తీసేసాను అంటూ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.(Samyuktha Menon)