Rana Mihika love story.. Married the week they met

Rana: రానా మిహికా బజాజ్ లది లవ్ మ్యారేజ్ అనే సంగతి మనకు తెలిసిందే.అయితే వీరి పెళ్లి 2020 ఆగస్టులో జరిగింది. రీసెంట్ గానే వీరు తమ నాలుగవ యానివర్సరీని జరుపుకున్నారు.అయితే రానా, మీహికా బజాజ్ ల పెళ్లి చాలా వెరైటీగా జరిగిందట. వీరిద్దరూ ఒక యాప్ ద్వారా పరిచయమై కలుసుకున్న వారం రోజుల్లోనే పెళ్లి చేసుకున్నారట.మరి ఇంతకీ వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది.. ఎలా పెళ్లి చేసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.

Rana Mihika love story.. Married the week they met

దగ్గుబాటి రామానాయుడు మనవడు రానా..తండ్రి తాతకు తగ్గట్టే సినిమాల్లో రాణిస్తున్న హీరో.. చాలామంది కేవలం హీరో లేదా విలన్ ఏదో ఒక పాత్రలో మాత్రమే రాణించగలరు.కానీ రానా మాత్రం తన కటౌట్ తో ఓ పక్క హీరోగా నటిస్తూనే మరోపక్క విలన్ గా కూడా అందరిని భయపెట్టిస్తున్నారు. అయితే అలాంటి రానా కరోనా సమయంలో ఇంట్లో ఖాళీగా కూర్చున్న సమయంలో హౌజ్ పార్టీ అనే యాప్ ద్వారా మిహికా బజాజ్ ని కలుసుకున్నారట. (Rana)

Also Read: Naga Chaitanya: సామ్,శోభితాతో పాటు నాగచైతన్య జీవితంలో మరో హీరోయిన్ ఎంట్రీ.. అంతా ఆ సినిమాలాగేనా.?

అయితే మిహికా బజాజ్ ఆ యాప్ లో కలవక ముందే రానా చాలా సంవత్సరాల ముందు ఆమెను నేరుగా చూశారట. అలా అప్పట్లో చూసి మళ్లీ ఈ యాప్ లో కనిపించే సరికి ఇద్దరి మధ్య మాటలు కలసి అధి కాస్త ప్రేమగా చిగురించి కలిసిన వారం రోజుల్లోనే పెళ్లి చేసుకుంటాను అంటూ మిహికా బజాజ్ కి రానా చెప్పారట. అయితే ఈ విషయం విని మిహికా ఏదో ఫన్నీగా చెబుతున్నాడు అనుకుందట.

Rana Mihika love story.. Married the week they met

కానీ ఆ తర్వాత నిజంగానే పెళ్లి చేసుకుంటాను అని అనడంతో రానా ఎలాంటి వాడో ఆయన గురించి మొత్తం తెలుసుకొని చివరికి మిహికా పెళ్లికి ఓకే చేసిందట. అలా పరిచయం పెరిగిన వారం రోజులకే మా పెళ్లి జరిగింది అంటూ రానా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు. అంతేకాదు నా లైఫ్ లో ఇది ఒక క్రేజీ మూమెంట్ అని కూడా చెప్పుకొచ్చారు.(Rana)