Team India: ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే టీమ్ ఇండియాపై ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది. మెగా ఈవెంట్ కు ముందు భారతజట్టు 3 వన్డేలు మాత్రమే ఆడాల్సి ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండుతో 3 వన్డేలు ఆడనుంది. ఇవాళ శ్రీలంకతో సిరీస్ లో భారత ప్లేయర్లు పర్ఫామెన్స్ ను సెలెక్టరు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే లంకతో సిరీస్ లో యువ ప్లేయర్ల అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయారు. దీంతో జట్టులో మార్పులు, చేర్పులు తప్పవని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే సెలెక్టర్ల దగ్గర పక్క ప్రణాళిక కూడా ఉందని చర్చ జరుగుతోంది. Team India

The Indian team for the Champions Trophy

కొంతమంది ప్లేయర్లపై ఫోకస్ పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంపికయ్యే 15 మంది పేయర్లు ఎవరనే దానిపై హాట్ టాపిక్ అవుతోంది. కెప్టెన్సీ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. భారత జట్టును రోహిత్ శర్మనే నడిపిస్తాడు. ఓపెనర్ గాను కంటిన్యూ అవుతాడు. అయితే గిల్ ఫామ్ గొప్పగా లేదు. కొంతకాలం నుంచి తన మార్క్ ను చూపించలేకపోతున్నాడు. ఎలాగో వైస్ కెప్టెన్ అయినందున జట్టులో ఉండడం ఖాయమే. బ్యాకప్ ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన శ్రీలంక వన్డే సిరీస్ లో మాత్రం జైస్వాల్ లేడు. Team India

Also Read: IPL 2025: ఐపీఎల్ లో కొత్త రూల్… ప్లేయర్లకు తీవ్ర అన్యాయం ?

లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం యశస్విని ఓపెనర్ గాను ఆడించే అవకాశాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. కానీ గిల్ వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని వాదన వినిపిస్తోంది. జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉండడం ఖాయమే. నంబర్ 3 బ్యాటర్ గా కోహ్లీ బరిలో ఉంటాడు. వికెట్ కీపర్ రేసులో పోటీ కనిపిస్తోంది. కేఎల్ రాహుల్ వర్సెస్ రిషబ్ పంత్ వర్సెస్ సంజు శాంసన్ గా పేరు మారిపోయింది. శ్రీలంకతో సిరీస్ లో తొలి రెండు మ్యాచుల్లో రాహుల్ బరిలోకి దిగాడు. మూడవ వన్డేలో పంత్ కు ఎక్కువ అవకాశం దక్కింది. ఒకవేళ పంత్ ను టీ20లో టెస్టులకే పరిమితం చేస్తే… ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కేఎల్ రాహుల్, సంజు శాంసన్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సంజు శాంసన్ ను ఎంచుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది. Team India

శ్రీలంకతో వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా ఛాంపియన్ ట్రోఫీ ఆడే భారత జట్టులో కచ్చితంగా ఉంటాడు. పాండ్యా ఎంట్రీ ఇస్తే జట్టు నుంచి శివమ్ దూబే వెళ్లిపోయే ఛాన్స్ ఉందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఆల్ రౌండర్ గా అక్షర్ పటేల్ జట్టులో చోటు దక్కించుకుంటాడని అవకాశాలు వినిపిస్తున్నాయి. యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ కూడా రేసులో ఉంటారని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. పేస్ బౌలింగ్ యూనిట్ ను జస్ప్రీత్ బుమ్రా లీడ్ చేస్తాడు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ జట్టులో ఉంటే రవి బిష్నోయ్, వాషింగ్టన్ సుందర్ కు ఛాన్స్ దొరకదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. షమీ, సిరాజ్, అర్షదీప్ సింగ్ కూడా చాంపియన్స్ ట్రోఫీ ఆడే జట్టులో ఉంటారని ఎక్స్పర్ట్ అంచనాలు వేస్తున్నారు. మొత్తంగా 15 మందిపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. Team India