Who insulted Rashmika

Rashmika: అంత పెద్ద యాక్టర్ రష్మిక ని అవమానించారా.. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయి నటిస్తున్న రష్మికని చూసి యాక్టింగ్ రాదని వెళ్లగొట్టింది ఎవరు? అంతలా అవమానించిన డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.సినిమా ఇండస్ట్రీలోకి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే చాలామంది నటీనటులు ఇబ్బందులను ఫేస్ చేశారు.మరీ ముఖ్యంగా ఇప్పుడు స్టార్లుగా ఉన్న ఎంతోమంది హీరో హీరోయిన్లు మొదట్లో ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇబ్బందులు పడిన వాళ్ళే ఉన్నారు.

Who insulted Rashmika

అలా చిరంజీవి మొదలు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ హీరోల వరకు ఎంతోమంది అలా ఇబ్బందులు పడ్డారు. అయితే హీరోలు మాత్రమే కాదు హీరోయిన్ లకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది హీరోయిన్స్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం దర్శకనిర్మాతల కోరికలు తీర్చుతూ ఎవరు ఏ అవకాశం ఇస్తారా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేవారు. (Rashmika)

Also Read: Ram Charan: RC16 డిలే అవ్వడానికి కారణం చరణేనా!!

అయితే స్టార్ హీరోయిన్ రష్మికకు కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక చేదు అనుభవం ఎదురయిందట. అదేంటంటే ఓ సినిమా కోసం ఆడిషన్ కి వెళ్తే అక్కడ డైరెక్టర్ రష్మిక ని చూసి అసలు నీ మొహానికి యాక్టింగ్ వస్తుందా అంటూ గోరంగా అవమానించారట. అంతేకాదు ఆడిషన్ కి వెళ్ళిన ప్రతిరోజు కన్నీళ్ళతో తిరిగి రావడంతో రష్మికనీ చూసి ఆమె తల్లి చాలా బాధపడిందట.

 Who insulted Rashmika

ఆమెను ఓదార్చుతూ కచ్చితంగా నువ్వు స్టార్ అవుతావు అని ధైర్యం చెప్పిందట. అలా తల్లి ఇచ్చిన ధైర్యంతో ప్రతిరోజు ఆడిషన్లకు వెళ్లేదట. అలా చాలా రోజులు ఆడిషన్స్ కి వెళ్లి ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి వచ్చాక ఓ సినిమాకు సెలెక్ట్ అయిందట. కానీ తర్వాత వెంటనే సినిమా రద్దయిందని తెలియడంతో రష్మిక చాలా బాధపడిందట.అలా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలను ఎదుర్కొని ప్రతి సినిమాకి తన నటనను మెరుగు పరుచుకుంటూ ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతోంది.(Rashmika)