Danam Nagender: తెలంగాణ కాంగ్రెస్కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎపిసోడ్ తలనొప్పిగా మారింది. ప్రతి విషయంలో..ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్…వివాదంగా మారుతున్నారు. ఇప్పటికే పార్టీ మారిన దానం నాగేందర్ పై ఎప్పుడు స్పీకర్ వేటు వేస్తారో తెలియని పరిస్థితి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం.. వంద రోజులు లోపు కచ్చితంగా దానం నాగేందర్ పై వేటు పడే ఛాన్స్ ఉంది. Danam Nagender

Expulsion of Danam Nagender from Congress party

అయితే ఇలాంటి నేపథ్యంలో మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగిన సందర్భంగా… ఓ రౌడీలా మాట్లాడి వివాదమయ్యారు దానం నాగేందర్. హైదరాబాదులో ఎవరిని తిరగనివ్వ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దానం నాగేందర్. అయితే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా వ్యతిరేకించారు. Danam Nagender

Also Read: Rahul Gandhi: రేవంత్ రెడ్డి పై రాహుల్ గాంధీ సీరియస్..?

అసెంబ్లీలో అలా మాట్లాడకూడదని… సూచనలు చేశారట. అయితే ఈ వివాదం మరువక ముందే మరో వివాదంలో చిక్కుకున్నారు దానం నాగేందర్. హైదరాబాదులో భూకబ్జాలకు దానం నాగేందర్ పాల్పడుతున్నారని మొదటి నుంచి ఓ వార్త ఉంది. అయితే తాజాగా.. కేబీఆర్ పార్క్ దగ్గర ఓ జిహెచ్ఎంసి గొడవ విషయంలో దానం నాగేందర్ పై కేసు నమోదు అయింది. Danam Nagender

హైడ్రా అధికారి ఏవి రంగనాథ్… ఆదేశాల మేరకు దానం నాగేందర్ పై కేసు నమోదు అయింది. అయితే దీనిపై దానం నాగేందర్ స్పందిస్తూ… ఏవి రంగనాథ్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే ప్రభుత్వ అధికారైన ఏవి రంగనాథ్కు వ్యతిరేకంగా దానం నాగేందర్.. మాట్లాడడం పట్ల ప్రభుత్వం సీరియస్ గా ఉందట. అతన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అనుకుంటుందట. దీనిపై రేవంత్ రెడ్డి.. అమెరికా నుంచి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారట. Danam Nagender