Neeraj Chopra: నీరజ్ చోప్రా, మనుభాకర్ ఇద్దరు ఒలింపిక్స్ లో సత్తా చాటారు. మెడల్స్ వేటులో స్టామినా చూపించారు. షూటర్ లో మనోభాకర్ ఏకంగా రెండు మెడల్స్ సాధించింది. నీరజ్ చోప్రా వరసగా రెండో ఒలింపిక్స్ లో మెడల్ అందుకున్నాడు. అయితే వీరిద్దరూ పారిస్ లో మాట్లాడుకుంటుండగా కెమెరా కంటపడ్డారు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్నటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఛాంపియన్స్ ఇద్దరూ ఒకే చోట కనిపించడంతో ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడుకుంటున్నారు. Neeraj Chopra

Manu Bhaker and Neeraj Chopra’s families shut wedding speculations

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో నీరజ్ మను ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. నాలుగేళ్ల క్రితం ఫోటోను ఇప్పుడు రీసెంట్ గా వీరిద్దరూ కలుసుకొని మాట్లాడుకున్నటువంటి ఫోటోను పక్కనపెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీరిద్దరూ మాట్లాడుకునే సమయంలో కాస్త సిగ్గుపడుతూ మాట్లాడుకుంటున్నట్లు కనిపించారు. Neeraj Chopra

Also Read: Team India: టీమిండియా ఆటగాళ్లకు 42 రోజులు సెలవులు ఇచ్చిన గంభీర్ !

అంతేకాకుండా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు వారి బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుందని చర్చ జరుగుతోంది. అదే సమయంలో నీరజ్ చోప్రాతో మనుభాకర్ తల్లి కూడా మాట్లాడింది. తలపై నీరజ్ చోప్రా చెయ్యి పెట్టుకొని ఫోటో తీసుకున్నట్టుగా కనిపించింది. మనును పెళ్లి చేసుకోవాలని అతనితో ఒట్టు వేయించుకుందేమోనని కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే అసలు పారిస్ లో ఏం జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. కాకపోతే ఎవరికి నచ్చినట్టుగా వారు కథనాలు అల్లేసుకుంటున్నారు. Neeraj Chopra

కొందరైతే నీరజ్ చోప్రా, మనుభాకర్ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం మొదలు పెట్టేశారు. దీనిపై స్టార్ షూటర్ తండ్రి స్పందించాడు. మను ఇంకా చిన్న పిల్ల అని చెప్పుకొచ్చాడు. తాము అసలు పెళ్లి గురించి ఆలోచించడం లేదని అన్నాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చేశారు. నీరజ్ చోప్రా, మనుభాకర్ ది హర్యానా. ప్రస్తుతం మనుభాకర్ వయసు 22 సంవత్సరాలు. నీరజ్ చోప్రా వయసు 26 సంవత్సరాలు. ఫ్యూచర్ టోర్నీలపై ఒలింపిక్స్ మెడల్స్ లో వీరిద్దరూ ఫోకస్ పెట్టారు. Neeraj Chopra