నటీనటులు: రామ్ పోతినేని (Double iSmart), కావ్య థాపర్, సంజయ్ దత్, షియాజీ షిండే, అలీ, గెటప్ శ్రీను తదితరులు
సినిమాటోగ్రఫీ: జియాన్ని జియాన్నెళ్లి, శ్యామ్ కే. నాయుడు
ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్
మ్యూజిక్: మణి శర్మ
నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మ్ కౌర్
దర్శకుడు : పూరి జగన్నాధ్
విడుదలతేదీ : 15 ఆగస్టు 2024

Double iSmart: A Disappointing Sequel to iSmart Shankar

రామ్ పోతినేని హీరోగా పూరీజగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కి మంచి విజయం రాగా ఇప్పుడు అదే కాంబో లో డబల్ ఇస్మార్ట్ అనే సినిమా తెరకెక్కింది. పలు అంచనాలమధ్య ఈరోజే విడుదలైన ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ఇద్దరికీ ఈ సినిమా హిట్ ఎంతో అవసరమైన నేపథ్యంలో ఈ చిత్రం ఎలా ఉందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ: బిగ్ బుల్ (సంజయ్ దత్) తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉండటంతో, మూడు నెలల్లో చనిపోతాని తెలుసుకుంటాడు. తాను చిరకాలం బతకాలని కోరిక ఉండటం, బిగ్ గోల్‌‌తో బతకాలని అనుకుంటాడు. దీని కోసం తన మెమోరీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని)కి ఆల్రెడీ మెమోరీ ట్రాన్స్‌ఫర్మేషన్ సక్సెస్ అయిందని, అతనిలో తన మెమోరీస్ జొప్పించాలని, ఇస్మార్ట్ శంకర్ రూపంలో తాను మళ్లీ బతకాలని కోరుకుంటాడు. దీంతో ఇస్మార్ట్ శంకర్ కోసం తన గ్యాంగ్‌ను దింపుతాడు. ఇస్మార్ట్ శంకర్ సైతం బిగ్ బుల్‌ మనీని కొల్లగొడుతుంటాడు. ఈ క్రమంలో జన్నత్ (కావ్యా థాపర్) కూడా ఇస్మార్ట్ శంకర్‌తో చేతులు కలుపుతుంది. ఇస్మార్ట్ శంకర్ సైతం తన టార్గెట్ బిగ్ బుల్ అని చెబుతుంటాడు. ఇస్మార్ట్ శంకర్‌కు మోమోరీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసేందుకు బిగ్ బుల్ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిన తరువాత ఏర్పడిన పరిణామాలు ఏంటి? బిగ్ బుల్‌ను పట్టుకునేందుకు రా ఏం చేసింది? ఈ కథలో జన్నత్ పాత్ర ఏంటి? పోచమ్మ (ఝాన్సీ) కారెక్టర్‌కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? చివరకు ఏం జరుగుతుంది? అన్నది తెరపై చూడాల్సిందే.

Also Read: Raviteja: మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ!!

నటీనటులు: రామ్ ఎనర్జీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. తెలంగాణ యాసలో మాట్లాడి మరోసారి ఆకట్టుకున్నాడు. డాన్స్ లు, డైలాగ్స్ ఇరగదీశాడు. ఇస్మార్ట్ శంకర్ కి మరెవరు సూట్ అవ్వరు అనే రేంజ్ లో నటించాడు. కావ్య థాపర్‌ పాత్ర పెద్దగా పండలేదు. ఆమెను హీరోయిన్‌గా కాకుండా ఐటెం సాంగ్‌ కోసమే తీసుకున్నట్లుంది. సంజయ్ దత్ విలన్ గా సెట్ కాలేదు. బిగ్ బుల్ పాత్రలో కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఈ పాత్ర కోసం ఎవరైనా తెలుగు నటుడిని తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. చాలారోజుల తర్వాత అలీ ఓ పాత్రతో మళ్ళీ ఆకట్టుకున్నాడు. ఇక కొత్త న‌టుడు స‌యాస్ పాత్ర హాస్యాస్పదంగా ఉంది. గెటప్ శ్రీను నటన కూడా బాగుంది. టెంపర్ వంశీ మూడు, నాలుగు సీన్స్ లో ఆకట్టుకున్నాడు. మిగితా పాత్రలు చెప్పుకోదగ్గవి కాదు.

సాంకేతిక నిపుణులు: దర్శకుడు పూరీ జగన్నాథ్ కమ్ బ్యాక్ ఇవ్వాలంటే తప్పక హిట్ కొట్టాల్సిన నేపథ్యంలో చేసిన ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కథ ఉంది కానీ అది చెప్పే విధానంలో పూరీ మళ్ళీ ట్రాక్ తప్పాడని చెప్పవచ్చు. మొదటినుంచి హీరో క్యారెక్టర్ ను అద్భుతంగా మలచడంలో మంచి పేరున్న పూరీ ఈ సినిమా హీరో క్యారక్టర్ విషయంలో ఎలాంటి వంక పెట్టడానికి లేదు కానీ కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. మొదటిభాగం పర్వాలేదనిపించగా సెకెండ్ ఆఫ్ పై అంచనాలు బాగున్నాయి కానీ సెకెండ్ ఆఫ్ ని నాసిరకంగా డీల్ చేశాడు డైరెక్టర్. క్లైమాక్స్ కూడా ఆకట్టుకోలేదు. సంగీతం పెద్దగా కుదరలేదు. ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ ఇంపాక్ట్ అయితే పెద్దగా క్రియేట్ చేయలేదు. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రమే..

ప్లస్ పాయింట్స్ :

రామ్ నటన

హీరో క్యారక్టరైజేషన్

కథ

మైనస్ పాయింట్స్:

కథనం

డైరెక్షన్

మ్యూజిక్

సెకండ్ హ్లాఫ్,క్లైమాక్స్

తీర్పు: పూరి జగన్నాథ్ మరోసారి డిజప్పాయింట్ సినిమా ఇచ్చాడు. కథ, సన్నివేశాల విషయంలో పూరి జగన్నాథ్ జడ్జిమెంట్ మిస్ అయిందనే అనుకోవాలి.ఒకానొక దశ తర్వాత స్టోరీ చాలా ప్రిడిక్టబుల్ అయిపోతుంది. క్లైమ్యాక్స్ ఎలా ఉంటుంది అనుకున్నామో అలాగే ఉంటుంది. ఓవరాల్ గా సినిమా ఒక్కసారి చూడడం కూడా కష్టమే

రేటింగ్ : 2/5