Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఐపీఎల్ నుంచి మొన్న టీ20 వరకు వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కెప్టెన్సీ అంశం వరకు ఏదో ఒక విషయంలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. అంతేకాదు పాండ్యాకు సంబంధించిన పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తన భార్య నటాషాకు విడాకులు ఇచ్చిన తర్వాత నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇక గత నెలలో విడాకులు తీసుకున్న ఈ జంట ప్రస్తుతం వేరువేరుగా ఉంటున్నారు. విడాకుల అనంతరం నటాషా తన కుమారుడిని తీసుకుని సెర్బియాకు వెళ్లిపోయింది. తన కుమారుడితో కలిసి సెర్బియాలో ఉంటుంది. Hardik Pandya

Hardik Pandya is dating Jasmin Walia after his split from Natasa Stankovic

అయితే విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా అతి తక్కువ సమయంలోనే మరొక అమ్మాయితో ప్రేమలో పడ్డాడని అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ప్రముఖ సెలబ్రిటీతో డేటింగ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. బ్రిటిష్ సింగర్ టీవీ నటి జాస్మిన్ వాలియాతో కలిసి హార్దిక్ పాండ్యా చట్టపట్టాలేసుకొని తిరుగుతున్నాడని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో వీరిద్దరూ పెడుతున్న పోస్టులను బట్టి హార్దిక్, జాస్మిన్ ఇద్దరూ కలిసి వెకేషన్ మూడ్ లో ఉన్నారని కన్ఫామ్ చేశారు. Hardik Pandya

Also Read: Neeraj Chopra: త్వరలోనే మను & నీరజ్ పెళ్లి…మను బాకర్ తండ్రి సంచలన ప్రకటన ?

గ్రీస్ లోని ఓ హోటల్ లోని స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ చేసుకున్నటువంటి వీడియోను హార్దిక్ పాండ్యా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం అదే ప్లేస్ లో తీసుకున్న వీడియోను జాస్మిన్ కూడా తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. పైగా జాస్మిన్ ఫోటోను హార్దిక్, హార్దిక్ ఫోటోను జాస్మిన్ లైక్ చేసుకున్నారు. దీంతో వీరిద్దరూ కలిసి గ్రీస్ కు వెకేషన్ కి వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పోస్టులకు మాత్రమే కాదు గతంలో జాస్మిన్ పెట్టిన ఫోటోలకు హార్దిక్ లైక్స్ కొట్టాడు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలామంది అంటున్నారు. Hardik Pandya

కాగా ఇంగ్లాండ్ కు చెందిన జాస్మిన్ టీవీ సీరియల్స్ లో, పలు రియాలిటీ షోలలో పాల్గొని పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి పలు ఆల్బమ్స్ లను రిలీజ్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో జాస్మిన్ కు 6.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సెర్బియాకు చెందిన నటి నటాషాను 2020లో హార్దిక్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ మగ బిడ్డ కూడా ఉన్నాడు. వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. వారిద్దరూ విడిపోతున్నట్టు గత నెలలో సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం హార్దిక్, నటి జాస్మిన్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. Hardik Pandya