Are they the ones who conspired against Sridevi

Sridevi: ఇండియన్ సినీ హిస్టరీలో తన అంద చందం అభినయంతో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న దివంగత నటి శ్రీదేవి అంటే తెలియని వారు ఉండరు.ఈమె దాదాపు 300 సినిమాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించింది. అలా బాలనటిగా తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టి చనిపోయే వరకు కూడా నటించింది.అయితే శ్రీదేవి దుబాయ్ పెళ్లికి వెళ్లి అనుమానాస్పస్థితిలోబాత్ టబ్ లో పడి చనిపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ బాహుబలి సినిమాలో శివగామి పాత్ర మిస్ చేసుకుందనే సంగతి మనకు తెలిసిందే.

Are they the ones who conspired against Sridevi

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే..బాహుబలి వంటి భారీ సినిమాలో శ్రీదేవిని వాళ్లే కావాలని తప్పించారట.మరి ఇంతకీ వాళ్ళు ఎవరు.. ఎందుకు శ్రీదేవి పై కుట్ర చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. రాజమౌళి దర్శకత్వంలో రెండు పార్ట్ లుగా వచ్చిన బాహుబలి మూవీలో శివగామి వంటి భారీ హిట్ ఇచ్చిన పాత్రలో మొదట అవకాశం వచ్చింది శ్రీదేవికే.(Sridevi)

Also Read: Bhagyashri Borse: దొంగ ముం** అంటూ స్టార్ యాంకర్ ని తిట్టిన భాగ్యశ్రీ బోర్సే.?

కానీ ఈ సినిమాలో శ్రీదేవి నటించకపోవడం కారణంగా రమ్యకృష్ణ ఆ పాత్ర పోషించి హిట్టు కొట్టింది. ఈ సినిమా తర్వాత రమ్యకృష్ణకి చాలా క్రేజ్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమాలో నటించడం కోసం శ్రీదేవి 8 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేయడమే కాకుండా తన ఖర్చులన్నీ చూసుకోవాలని కండిషన్ పెట్టిందట. దాంతో బడ్జెట్ ఎక్కువవుతుందనే కారణంతో రాజమౌళి వద్దని రమ్యకృష్ణని పెట్టుకున్నారట.

Are they the ones who conspired against Sridevi

అయితే ఇదే విషయం గురించి రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయం బయటపెట్టారు. కానీ ఈ విషయం తెలిసాక శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ అసలు నేను అంత పారితోషికం అడగలేదు. ఒకవేళ డబ్బు కోసమే నటించి ఉంటే ఇన్ని సినిమాల్లో చేయగలిగేదాన్ని కాదు. ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పింది.అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని నిర్మాతలు వద్దన్నారట. కానీ శ్రీదేవి అలా చెప్పడం రాజమౌళి మరోలా చెప్పడంతో ఈ సినిమా నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డలే శ్రీదేవి ని ఇందులో నుండి తప్పించారు అనే టాక్ వినిపించింది.(Sridevi)