Bhagyashri Borse who scolded the star anchor

Bhagyashri Borse: చాలామంది తెలుగులోకి వచ్చే హీరోయిన్లు ముంబై,కన్నడ,తమిళ్ ఇండస్ట్రీ నుండి వచ్చి స్టార్స్ అవుతారు.అలా మన తెలుగులో కేరళ కుట్టిలు,కన్నడ కస్తూరీలు,బెంగాలీ భామలు,ముంబై ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి కాకుండా ఇతర ఇండస్ట్రీ నుండి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.మన తెలుగు డైరెక్టర్లు నిర్మాతలు హీరోలకు కూడా తెలుగు అందాల కంటే ఇతర రాష్ట్రాల అందాలే నచ్చుతాయి కావచ్చు. అందుకే వారికే వరుస ఆఫర్స్ ఇస్తారు.

Bhagyashri Borse who scolded the star anchor

అయితే తాజాగా రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలో తన అందంతో మెప్పించింది నటి భాగ్యశ్రీ బోర్సే.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన మొదటి సినిమా మిస్టర్ బచ్చన్..ఇక ఈమె మొదట బాలీవుడ్ లో యారియాన్ -2 అనే రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీలో నటించింది.ఆ తర్వాత హీరోయిన్ ని హరీష్ శంకర్ టాలీవుడ్ కి మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా పరిచయం చేశారు.ఇక ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భాగ్యశ్రీ బోర్సే అందానికి మాత్రం తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. (Bhagyashri Borse)

Also Read: Pooja Hegde: అర్ధరాత్రి ఆ హీరోతో పూజ హెగ్డే.. ఫుల్లుగా ఎంజాయ్ చేసి.?

అలాగే దర్శక నిర్మాతలకు కూడా ఈమె నటన నచ్చడంతో వరుస సినిమాల్లో అవకాశాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అయితే తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్స్ తో భాగంగా దావత్ అనే ప్రోగ్రాం లో పాల్గొన్న భాగ్యశ్రీ బోర్సే స్టార్ యాంకర్ ని దొంగ ముం అంటూ బూతు మాట తిట్టింది.మరి అలా ఎందుకు తిట్టింది అనేది ఇప్పుడు చూద్దాం.. రీతు చౌదరి హోస్ట్ గా చేసిన దావత్ షోలోకి హోస్ట్ గా ప్రస్తుతం అరియానా గ్లోరీ చేస్తోంది.

Bhagyashri Borse who scolded the star anchor

అయితే ఈ షో కి వచ్చిన భాగ్యశ్రీ బోర్సేతో మీకు తెలుగులో వచ్చిన ఏదైనా బ్యాడ్ వర్డ్ చెప్పండి అనగా దొంగముం అంటూ అనేసింది.. అయితే ఎంతో క్యూట్గా దొంగము** అంటూ భాగ్యశ్రీ బోర్సే అనడంతో దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అంతేకాదు భాగ్యశ్రీ బోర్సే బూతు పదానికి అరియానా సైతం షాక్ అయ్యి బుంగమూతి పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ భాగ్యశ్రీ అన్న పదానికి ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.(Bhagyashri Borse)