Clash in shooting..Jr.NTR fire on heroine

Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లతో జతకట్టారు.ఎన్టీఆర్ గజాల, అంకిత, భూమిక, ఆర్తి అగర్వాల్, ప్రియమణి మొదలు ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ అందరితో జత కట్టారు. అయితే అలాంటి ఈ హీరో టాలీవుడ్ లో నటించిన ఆ ఒక్క హీరోయిన్ తో మాత్రం జతకట్టలేదు. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు ఆ హీరోయిన్ తో ఎన్టీఆర్ సినిమా చేయలేదు.. అవకాశం వచ్చినా కూడా ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Clash in shooting..Jr.NTR fire on heroine

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు అందరూ హీరోయిన్లతో నటించారు కానీ అనుష్క శెట్టితో మాత్రం సినిమా తీయలేదు. అయితే వీరి కాంబినేషన్లో గతంలో శక్తి మూవీ ని అనుకున్నారట.. అశ్విని దత్ నిర్మాతగా చేసిన మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన శక్తి మూవీలో ఎన్టీఆర్ హీరోగా ఇలియానా హీరోయిన్ గా చేసింది. అయితే ఇందులో హీరోయిన్ గా ముందు అనుష్కని అనుకున్నారట.(Jr.NTR)

Also Read: Thangalaan: తంగలాన్ మూవీ ఆ తెలుగు హీరో చేయాల్సింది.. కానీ..?

కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా నుండి అనుష్కను తప్పించి ఇలియానాని తీసుకున్నారు. అయితే ఆ సమయంలో అనుష్క రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడంతో అనుష్కకి ఎన్టీఆర్ కి మధ్య గొడవ జరిగిందనే టాక్ కూడా వినిపించింది.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.ఎందుకంటే చింతకాయల రవి సినిమా సమయంలో ఓ పాటలో ఎన్టీఆర్,అనుష్క శెట్టి లు పక్కపక్కనే నిల్చొని డాన్స్ చేస్తారు.

Clash in shooting..Jr.NTR fire on heroine

ఆ సమయంలో ఎన్టీఆర్ అనుష్క శెట్టిల జోడి తెర మీద అస్సలు కుదరలేదు.ఎందుకంటే అనుష్క శెట్టి చాలా హైట్ ఉంటుంది. ఇక హైట్ కారణంగా వీరిద్దరికీ జోడి మ్యాచ్ అవ్వకపోవడంతో శక్తి సినిమాలో నటిస్తే పర్సనాలిటీ ప్రాబ్లం వచ్చి సినిమా ఫ్లాప్ అవుతుంది అని ముందుగానే అనుష్క నీ తప్పించి ఇలియానాని తీసుకున్నారట. ఇక ఆ సినిమా నుండి అనుష్కను తప్పించినప్పటికీ రిజల్ట్ మాత్రం మారలేదు. శక్తి మూవీ డిజాస్టర్ అయిన సంగతి మనకు తెలిసిందే.(Jr.NTR)