Arshad Nadeem: పారిస్ ఒలింపిక్స్ జావేలిన్ త్రోలో స్వర్ణ పథకం గెలిచి చరిత్ర సృష్టించాడు పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్. దీంతో దేశవ్యాప్తంగా అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అతని ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని ప్రజలు నదీమ్ కు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. నదీమ్ ఇంటికి అభిమానులు భారీగా చేరుకొని అతనికి డబ్బులు అందజేస్తున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నదీమ్ ను కలిసి కొందరు వ్యక్తులు నగదు సహాయం అందజేశారు. Arshad Nadeem

Pakistan’s Olympic Gold Medallist Arshad Nadeem Receives Unique Gift

ఈ సందర్భంగా నదీమ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ నదీమ్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాడని తాను సాయం చేసినట్లే ప్రభుత్వం సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశాడు. ప్రభుత్వం ప్రతిసారి వాగ్దానాలు చేస్తుంది తప్ప ఎలాంటి సహాయం చేయడం లేదు. పారిస్ ఒలంపిక్ జావెలిన్ త్రోలో నదీమ్ స్వర్ణ పథకం గెలిచిన అనంతరం పాక్ ప్రభుత్వం భారీగా రివార్డులను, అవార్డులను ప్రకటించింది. Arshad Nadeem

Also Read: Neeraj Chopra: త్వరలోనే మను & నీరజ్ పెళ్లి…మను బాకర్ తండ్రి సంచలన ప్రకటన ?

అతని ప్రతిభకు గుర్తింపుగా అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు అక్కడి రేడియో పాకిస్తాన్ వెల్లడించింది. పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ పాకిస్తాన్ కరెన్సీలో 100 మిలియన్లు ఇస్తున్నట్లు ప్రకటించాడు. పంజాబ్ గవర్నర్ సర్దార్ సలీమ్ హైదర్ ఖాన్ పాకిస్తాన్ కరెన్సీలో రెండు మిలియన్లు అందించనున్నట్లు తెలియజేశాడు. Arshad Nadeem

పంజాబ్ ముఖ్యమంత్రి పాకిస్తాన్ కరెన్సీలో 50 మిలియన్ల మొత్తాన్ని నదీమ్ కు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే గవర్నర్ ఒక మిలియన్ ప్రకటించాడు. నదీమ్ జావెలిన్ కెరియర్ 2015లో ప్రారంభమైంది. నదిమ్ ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఖర్చులకోసం గ్రామంలోని వారు చందాలు వేసుకుని డబ్బులు ఇచ్చేవారని ….అతని తండ్రి ఆశ్రఫ్ వెల్లడించాడు. సొంత దేశమైన పాకిస్తాన్ లో అతడికి స్కాలర్షిప్ కూడా లభించలేదని వాపోయారు. నదీమ్ కు డైట్ విషయంలో అతని అంకుల్ సహాయం చేసినట్లు తెలిపారు. అలాగే నదీమ్ కు బర్రెను కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. Arshad Nadeem