Thangalaan Movie That Telugu Hero Should Do.. But

Thangalaan: చియాన్ విక్రమ్ హీరోగా చేసిన తంగలాన్ మూవీ తెలుగు మలయాళ, కన్నడ,తమిళ, హిందీ భాషలలో ఆగస్టు 15న గ్రాండ్గా విడుదలైంది.పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని చూసిన జనాలు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో ఏ హీరోని చూడలేదు అని చియాన్ విక్రమ్ ని చూసి పొగుడుతున్నారు.సినిమా చూసిన జనాలు థియేటర్ నుండి బయటికి ఎంట్రీ ఇవ్వడంతోనే పాజిటివ్ రివ్యూలు ఇవ్వడంతో చాలామంది జనాలు ఈ సినిమా చూడడానికి ఎగబడుతున్నారు.

Thangalaan Movie That Telugu Hero Should Do.. But

ఒకేరోజు ఇక రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలతో పాటు విక్రమ్ తంగలాన్ మూవీ కూడా విడుదల అవ్వడంతో మూడు సినిమాల మధ్య పోటీ నెలకొంది. కానీ ఈ మూడు సినిమాలలో తంగలాన్ సినిమానే ది బెస్ట్ ఉంది అని చెప్పడంతో చాలా మంది సినీ ప్రేక్షకులు తంగలాన్ సినిమా చూడడానికి ముందుకు వస్తున్నారు.మాళవిక మోహనన్ హీరోయిన్ గా చేసిన ఈ మూవీలో హీరోని చాలా కొత్తగా చూపించారు డైరెక్టర్ రంజిత్. ఇక ఇలాంటి పాత్రలో ఏ హీరోలు కూడా చేయడానికి అస్సలు ముందుకు రారు. (Thangalaan)

Also Read: Thangalaan Review: పవర్‌ఫుల్ కథనంతో ప్రేక్షకులను మెప్పించిన విక్రమ్ ‘తంగలాన్’

ఎందుకంటే తమ అభిమానులు ఇలాంటి పాత్రల్లో చేస్తే అస్సలు యాక్సెప్ట్ చేయరు. అందుకే చాలామంది హీరోలు ఇలాంటి పాత్రల్లో చేయడానికి అస్సలు సాహసించరు. అయితే చియాన్ విక్రమ్ చేసిన తంగలాన్ మూవీ ఓ టాలీవుడ్ హీరో తో చేద్దామని మొదట డైరెక్టర్ నిర్ణయించుకొని ఆ హీరోకి కథ కూడా చెప్పారట. కథ విని ఆ హీరో ఓకే చెప్పాక డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో సినిమానే రిజెక్ట్ చేశారట.మరి ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా.. ఆయన ఎవరో కాదు అల్లు అర్జున్..

Thangalaan Movie That Telugu Hero Should Do.. But

పుష్ప సినిమాలో స్మగ్లింగ్ చేసే డిఫరెంట్ పాత్రలో నటిస్తున్న అల్లు అర్జున్ కి తంగలాన్ మూవీ కరెక్ట్ గా సెట్ అవుతుంది అని రంజిత్ అనుకొని ఈ కథ చెప్పారట. అల్లు అర్జున్ కి కూడా కథ బాగా నచ్చినప్పటికీ పుష్ప -2 సినిమాకి ఈ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయడం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ స్టోరీ విక్రమ్ దగ్గరికి వచ్చింది. అలా ఈ మూవీలో విక్రమ్ హీరోగా చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. అయితే ఈ సినిమా చూసిన చాలా మంది తెలుగు ప్రేక్షకులు అల్లు అర్జున్ ఈ సినిమా చేయకపోవడమే మంచిదయింది. ఒకవేళ ఈ సినిమాలో చేస్తే ఆయన్ని ఫ్యాన్స్ అంతగా యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఫలితంగా మంచి సినిమా డిజాస్టర్ అయ్యేది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Thangalaan)