Geetha Govindam who completed 6 years.. Star hero who missed this movie

Geetha Govindam: డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో వచ్చిన కామెడీ లవ్ ఓరియెంటెడ్ మూవీ గీత గోవిందం.. ఈ సినిమా 2018 ఆగస్టు 15న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. అలా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన గీతా గోవిందం మూవీ విడుదలైన మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే దాదాపు 132 కోట్ల కలెక్షన్లను వసూళ్ళు చేసి బ్లాక్ బస్టర్ అయ్యింది.

Geetha Govindam who completed 6 years.. Star hero who missed this movie

అయితే అలాంటి గీత గోవిందం మూవీలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాలు హీరో హీరోయిన్స్ గా చేస్తే నాగబాబు, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణలు నటించారు. అలాగే అను ఇమ్మానియేల్, నిత్యామీనన్ లు గెస్ట్ రోల్స్ చేశారు.. ఇక ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో చాలామంది థియేటర్లకు ఈ సినిమా చూడడానికి ఎగబడ్డారు.. (Geetha Govindam)

Also Read: Lavanya Tripathi: తల్లి కాబోతున్న లావణ్య.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్.?

అలా గీతగోవిందం మూవీ సమయం నుండి రష్మిక,విజయ్ ల మధ్య ప్రేమ చిగురించింది అనే టాక్ కూడా ఉంది. అయితే అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలై ఈ ఏడాది ఆగస్టు 15 తో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈ గీత గోవిందం మూవీ లో హీరోగా చేయాల్సింది విజయ్ దేవరకొండ కాదట. పరుశురాం మొదట వేరే హీరోని అనుకున్నారట.ఇక ఆయన ఎవరంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

Geetha Govindam who completed 6 years.. Star hero who missed this movie

గీత గోవిందం లో హీరోగా ఫస్ట్ ఛాయిస్ అల్లు అర్జున్ ని అనుకున్నారట డైరెక్టర్.కానీ ఆయన వేరే సినిమాలో బిజీగా ఉండడం,అలాగే హీరోయిన్ వెంటపడుతూ ఆమెను బతిమిలాడే క్యారెక్టర్ లో చేయాలి కాబట్టి ఆయన ఫ్యాన్స్ ఒప్పుకోరని అల్లు అర్జున్ రిజెక్ట్ చేసినట్టు టాక్ వినిపించింది. అలాగే రష్మిక మందన్నా కంటే ముందే లావణ్య త్రిపాటిని హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఈ సినిమాలో హీరోతో లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది కాబట్టి లావణ్య త్రిపాఠి రిజెక్ట్ చేసిందట.(Geetha Govindam)