Lavanya Tripathi who is going to be a mother

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి నిజంగానే తల్లి కాబోతుందా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్ లో ఎంత నిజం ఉంది.. మెగా ఫ్యామిలీలోకి బుల్లి వారసుడు రాబోతున్నాడా అనేది ఇప్పుడు చూద్దాం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనలకు క్లింకార ఎప్పుడైతే పుట్టిందో అప్పటినుండి మెగా ఫ్యామిలీ లో అన్ని శుభశకునాలే జరుగుతున్నాయి. క్లింకారా రాకతో ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ అవార్డు, చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు,పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పూర్తి మెజారిటీతో గెలుపు, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా పెళ్లి ఇలా ఎన్నో శుభాలు జరిగాయి.

Lavanya Tripathi who is going to be a mother

అయితే తాజాగా మెగా ఫ్యామిలీలోకి క్లింకారాకి చెల్లెలో తమ్ముడో రాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠిలు గత ఏడాది నవంబర్ 1న ఇటలీలో కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్లి చేసుకున్నారు.ఇక పెళ్ళై ఏడాది కాకముందే లావణ్య త్రిపాటి తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. (Lavanya Tripathi)

Also Read: Jr.NTR: షూటింగ్ లో గొడవ.. హీరోయిన్ పై ఎన్టీఆర్ ఫైర్..?

ఇక గత కొద్దిరోజుల నుండి లావణ్య సినిమాలు చేయకుండా ఇంటి దగ్గరే ఉంటుంది. అయితే తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు తిరుమల తిరుపతి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇక ఈ ఆలయాన్ని దర్శించుకొని తిరిగి వచ్చే సమయంలో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లకు సంబంధించిన కొన్ని ఫొటోస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Lavanya Tripathi who is going to be a mother

లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లు సాంప్రదాయమైన పంచకట్టు పట్టు సారిలో మెరిశారు. అయితే లావణ్య త్రిపాఠి ఫేస్ లో కాస్త గ్లో తో పట్టు శారీలో ఆమె పొట్ట కాస్త ఎత్తుగా కనిపించడంతో లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది..అందుకే తిరుమల శ్రీవారిని వరుణ్ తేజ్ లావణ్య ల జంట దర్శించుకుంది అంటూ సోషల్ మీడియాలో వీరి ఫోటోలు షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.. మరి లావణ్య త్రిపాటి తల్లి కాబోతుంది అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇస్తే గాని తెలియదు.(Lavanya Tripathi)