Prabhas is going to do Imanvi in ​​the movie

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ మామూలుగా లేదు.ఈ మధ్యనే కల్కి మూవీతో హిట్టు కొట్టిన ప్రభాస్ కల్కి పార్ట్ టు ని కూడా ఇప్పటికే సగం పూర్తి చేశారట. ఇక సలార్ -2 సినిమా కూడా కొద్ది వరకు షూటింగ్ పూర్తి అయినట్టు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం రాజా సాబ్ సినిమాకి సంబంధించి రీసెంట్ గానే ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు అట్టహాసంగా మొదలయ్యాయి.

Prabhas is going to do Imanvi in ​​the movie

ఇక ఈ షూటింగ్ కూడా త్వరలోనే మొదలవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాకి కూడా ప్రభాస్ ఓకే చెప్పారు. ఈ సినిమాకి సంబంధించి ఇంకా పూజ కార్యక్రమాలు జరగలేదు.ఇక త్వరలోనే దీన్ని కూడా అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ప్రభాస్ హాను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఫౌజి సినిమాలో ఒక కొత్త నటిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు డైరెక్టర్. (Prabhas)

Also Read: Karthikeya 2: నిఖిల్ కి అవార్డు వస్తే నితిన్ ని విష్ చేస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..?

ఇక ఆమె ఎవరో కాదు డాన్సర్ కొరియోగ్రాఫర్ అయినటువంటి ఇమాన్వి ఇస్మాయిల్.. అయితే ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా ఈ అమ్మాయి నటించలేదు. కానీ ప్రభాస్ సినిమాతో ఈమె ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ ఫౌజి సినిమా పూజా కార్యక్రమాలలో ఇమాన్వీ కనిపించడంతో చాలామంది నెటిజన్లు ఈమె గురించి నెట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. దాంతో ఈమె బ్యాగ్రౌండ్ మొత్తం బయటపడింది. అయితే ఈమె డాన్స్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

Prabhas is going to do Imanvi in ​​the movie

అంత బాగా చేస్తుంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఇమాన్వి చేస్తుంది అని తెలియడంతో ఈమెకు ఫాలోవర్స్ లక్షల్లో పెరిగిపోతున్నారు. అలా ఒక్కసారిగా సోషల్ మీడియాలో హైలెట్గా నిలిచింది ఇమాన్వి ఇస్మాయిల్. అయితే ఈమె ఎవరి కూతురో ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది మాత్రం బయటపడలేదు. కానీ కొంతమంది నెటిజన్స్ ఈమె డాన్సర్ కొరియోగ్రాఫర్ కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ డాన్సర్ కూతురు కావచ్చు అని కామెంట్స్ పెడుతున్నారు కానీ ఇందులో ఎంత నిజముంది అనేది మాత్రం తెలియదు.(Prabhas)