Shakib Al Hasan: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ ఆల్ హసన్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. తన భార్యను మోసం చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఆ వార్తలను షకీబ్ ఆల్ హసన్ భార్య శిశిర్ ఖండించారు. తప్పుడు వార్తలను వైరల్ చేయొద్దు అంటూ ఆమె కోరారు. భర్తగా, తండ్రిగా షకీబ్ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నాడంటూ తన భర్తని వెనకేసుకొచ్చింది. భర్తతో కలిసి దిగిన ఫోటోలను శిశిర్ సోషల్ మీడియాలో డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. Shakib Al Hasan

Shakib Al Hasan’s wife Umme addresses adultery allegations on star Bangladesh all-rounder

అయితే తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేయలేదని ప్రైవేట్ లో పెట్టానని వివరణ ఇచ్చింది. క్రికెట్ పరంగా నా భర్త గురించి మీ అందరికీ రకరకాల అభిప్రాయాలు ఉండవచ్చు. వాటిని నేను తిరస్కరించను. ప్రతి ఒక్కరికి మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది. మీరు క్రికెట్ పరంగా ఎన్ని విమర్శలు అయినా చేయండి. కానీ దయచేసి వాటిని మా వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టవద్దు. ఆయన గొప్ప భర్త, తండ్రి. నాతో చాలా నిజాయితీగా ఉంటారు. నన్ను అస్సలు బాధపెట్టారు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధము ఉంది. Shakib Al Hasan

Also Read: Hardik Pandya: బ్రిటిష్ సింగర్ తో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి…?

పెళ్లయిన కొత్తలో నాతో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అదేవిధంగా ఉంటున్నాడు. జీవిత భాగస్వామిగా అతనికి వంద మార్కులు ఇస్తానని చెప్పారు శిశిర్. మాకు అందమైన కుటుంబం ఉంది. దయచేసి సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్స్ ను ఆపేయండి. ఇలాంటి వార్తలను వ్యాప్తి చేస్తున్న వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేను నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడానికి ఇష్టపడను. నిజం నావైపు ఉంది కాబట్టి నిశ్శబ్దంగా ఉండాలని అనుకున్నాను. కానీ అసలు అనవసరమైన ఫోన్ కాల్స్, మెసేజ్ లు వస్తుండడంతో అవన్నీ తప్పుడు వార్తలని స్పష్టం చేయడానికి ముందుకు వచ్చాను. Shakib Al Hasan

షకీబ్ ఇప్పుడు పాకిస్తాన్ సిరీస్ పై ఫోకస్ పెట్టారు. నేను నా కుటుంబంపై దృష్టి సారిస్తాను. నేను సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులను, ఫోటోలను డిలీట్ చేయలేదు. వాటిని ప్రైవేట్ లో పెట్టానని షకీబ్ భార్య శిశిర్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. కాగా షకీబ్ హసన్ ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నారు. ఆగస్టు 21 నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తన భార్య తనపై ఉంచిన నమ్మకం షకీబ్ కు అదనపు బలం కానుంది. Shakib Al Hasan